ముగిసిన రాష్ట్రస్థాయి స్కూల్‌గేమ్స్ బాలికల ఖోఖో పోటీలు
● విజేతగా నిలిచిన తూర్పుగోదావరి
● ద్వితీయ స్థానంలో చిత్తూరు జట్టు
● తృతీయ స్థానంలో అతిథ్య విజయనగరం జట్టు
● నాల్గవ స్థానంలో శ్రీకాకుళం జట్టు
● విజేతలకు బహుమతుల ప్రదానం
విజయ
నగరం: విజయనగరం వేదికగా మూడురోజులుగా ఉత్సాహభరిత వాతావరణంలో జరిగిన 69 వ అండర్–17 స్కూల్‌గేమ్స్ రాష్ట్ర స్థాయి బాలికల ఖోఖో పోటీలు మంగళవారం ముగిశాయి. ఈ పోటీల్లో తూర్పుగోదావరి జట్టు విజేతగా నిలిచింది. ద్వితీయస్థానాన్ని చిత్తూరు జిల్లా జట్టు దక్కించుకుంది. చివరిరోజు మంగళవారం నగర శివారులో గల విజ్జి స్టేడియంలో జరిగి న ఫైనల్ మ్యాచ్‌లో రెండు జట్ల మధ్య ఉత్కంఠంగా, హోరాహోరీగా జరిగిన మ్యాచ్‌లో తూర్పుగోదావరి 7 పాయింట్లు, చిత్తూరు 6 పాయింట్లు కై వసం చేసుకున్నా యి. తూర్పుగోదావరి జట్టు క్రీడాకారిణి నందిని అద్భుతమైన ఆటతీరుతో జట్టు విజయంలో కీలక భూమిక పోషించింది. అనంతరం తృతీయ, నాల్గవ స్థానాలకు విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల జట్ల మధ్య జరిగిన పోటీలో ఇరుజట్లు రెండేసి పాయింట్లు సాధించి టైగా నిలవడంతో టాస్ ద్వారా విజేతను ప్రకటించారు. టాస్ గెలిచిన విజయనగరం జట్టు తృతీయ స్థానాన్ని, నాల్గవ స్థానంలో శ్రీకాకుళం జట్టును ప్రకటించారు.
విజేతలకు అభినందనలు
పోటీల్లో విజేతలుగా నిలిచిన జట్లకు విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి, జిల్లా విద్యాశాఖ అధికారి యు.మాణిక్యంనా యుడు, సీనియర్ ఖోఖో క్రీడాకారులు ఏవీఎన్, ఏపీ పోస్టల్ కబడ్డీ జట్టు కోచ్ పతివాడ.శ్రీనివాసరావు, జిల్లా క్రికెట్ సంఘం కార్యదర్శి రాంబాబులు బహుమతులు అందజేశారు. విజేతలను అతిథులు అభినందించారు. జట్టును విజయతీరానికి చేర్చడంలో ఆల్‌రౌండర్ ప్రదర్శన కనబరిచిన తూర్పుగోదావరి జట్టు క్రీడాకారిణి నందినికి పోస్టల్ కబడ్డీ కోచ్ పి.శ్రీనివాసరావు వెయ్యి రూపాయలు నగదు బహుమతి అందజేశారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి మాట్లాడు తూ ఖో ఖో,కబడ్డీ క్రీడలకు ప్రసిద్ధి అయిన విజయనగరంలో ఖోఖో బాలికలు పోటీలు ఇక్కడ నిర్వహించడం గర్వకారణంగా ఉందన్నారు. బాలికల ఆట తీరు మరువలేదని వాఖ్యానించారు. ఇదే స్ఫూర్తిని జాతీయ పోటీల్లో కొనసాగించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జిల్లా విద్యా శాఖ మంత్రి యు.మాణిక్యం నాయుడు మాట్లాడుతూ మూడురోజులు పాట శ్రమించి రాష్ట్ర పోటీలను విజయవంతం చేసిన స్కూల్ గేమ్స్ కార్యదర్శులు, వ్యాయామ ఉపాద్యాయులు, సహకరించిన వివిధ క్రీడా సంఘాల నాయకులు అభినందించా రు. కార్యక్రమంలో జిల్లా వ్యాయమ ఉపాధ్యాయుల సంఘం నాయకులు ఎల్‌వీ రమణ, ఎన్.వెంకటనాయుడు, స్కూల్‌గేమ్స్ కార్యదర్శులు కె.గోపాల్, ఎస్.విజయలక్ష్మి, వ్యాయామ ఉపాద్యాయులు పాల్గొన్నారు.
ముగిసిన రాష్ట్రస్థాయి స్కూల్‌గేమ్స్ బాలికల ఖోఖో పోటీలు


