యువకుడి ఆకస్మిక మృతి
విజయనగరం క్రైమ్: నగరంలోని కణపాకకు చెందిన యువకుడు కల్యాణ రామచంద్రరావు(29) నిద్రలోనే గుండెపోటుతో మంగళవారం మృతిచెందాడు. ఇందుకు సంబంధించి విజయనగరం వన్‌టౌన్ హెచ్‌సీ రామారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కల్యాణ రామచంద్రరావు తండ్రి మృతిచెందడంతో తల్లి స్వీపర్‌గా పీటీసీలో పనిచేస్తూ కొడుకును పోషిస్తోంది. రామచంద్రరావుకు అక్కా,చెల్లెళ్లు ఉండగా వారికి పెళ్లిళ్లు కావడంతో జులాయిగా తిరిగి వ్యసనాల బారిన పడ్డాడు. తల్లి తెచ్చే డబ్బులతో విచ్చలవిడిగా మందు కొడుతూ బాధ్యతారాహిత్యంగా తిరిగేవాడు. ఈ క్రమంలోనే ముందురోజు మద్యం తాగి కణపాకలోని తన ఇంట్లోనే మేడమీదకు వెళ్లి పడుకున్నాడు. తెల్లవారే సరికి తల్లి ఎంతసేపు పిలిచినా పలకకపోవడంతో స్థానికుల సహాయంతో ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు ఆస్పత్రి వర్గాలు నిర్ధారించారు. ఫిర్యాదు మేరకు వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


