
ఆర్డర్లు తక్కువ..
గతంతో పోల్చుకుంటే ఈ ఏడాది ఆర్డర్ల సంఖ్య తగ్గింది. మట్టి వినాయక విగ్రహాలకు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. పర్యావరణానికి చేటుచేసే ఎటువంటి రసాయనాలు ఉపయోగించం. లాభం తక్కువ వచ్చినా మట్టి బొమ్మలనే తయారు చేస్తుంటాం. మేము తయారు చేసే విగ్రహాలకు జిల్లా వ్యాప్తంగా పేరుంది. – అమలాపురం శ్రీనివాసరావు,
మట్టి విగ్రహాల కళాకారుడు, పాల్తేరు గ్రామం
ప్రోత్సాహం కరువు..
మాలాంటి కళాకారులను ప్రోత్సహిస్తే మరింతగా రాణిస్తాం. ప్రస్తుతం పోలీసు నిబంధనలు ఎక్కువ కావడంతో ఉత్సవాల నిర్వహణకు యువత ఆసక్తి కనబరచడం లేదు. అధికారులు, పర్యావరణ ప్రేమికులు ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాల వల్ల కలిగే నష్టాలను ప్రజలకు వివరిస్తే మట్టి బొమ్మలకు గిరాకీ ఉంటుంది. మాలాంటి కళాకారులకు న్యాయం జరుగుతుంది. – సుంచెల సత్యనారాయణ,
మట్టివి గ్రహాల కళాకారుడు, పాల్తేరు గ్రామం

ఆర్డర్లు తక్కువ..

ఆర్డర్లు తక్కువ..

ఆర్డర్లు తక్కువ..