
సినీ సంగీత విభావరికి ఏర్పాట్లు పూర్తి
విజయనగరం టౌన్: ఘంటసాల స్మారక కళాపీఠం ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం 6గంటల నుంచి ఆనందగజపతి ఆడిటోరియంలో నిర్వహించనున్న రామకృష్ణ సినీ సంగీత విభావరికి ఏర్పాట్లు పూర్తిచేసినట్లు కళాపీఠం వ్యవస్థాపకుడు ఎం.భీష్మారావు సోమవారం తెలిపారు. ఈ మేరకు కళాపీఠం ఆవరణలో కరపత్రాలను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సాయి, పవన్‌ల సంగీత సారథ్యంలో ప్రముఖ వాయిద్య కళాకారులు, గాయనీ, గాయకులతో అద్భుతమైన గీతాలాపన ఉంటుందన్నారు. సంగీతాభిమానులందరూ హాజరుకావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కళాపీఠం ప్రతినిధులు పాల్గొన్నారు.