
అర్జీదారుల సమస్యకు తగిన పరిష్కారం చూపండి
● కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్
● పీజీఆర్‌ఎస్‌కు 107 అర్జీలు
పార్వతీపురం రూరల్: అర్జీదారుల సమస్యలకు తగిన పరిష్కారం చూపించి కచ్చితమైన సమాచారాన్ని అందజేయాలని కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ అధికారులకు తేల్చి చెప్పారు. పరిష్కారం కాకపోతే అందుకు గల కారణాలతో కచ్చితత్వంతో కూడిన సమాచారాన్ని వారికి అందజేయాలని స్పష్టం చేశారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్‌లో కలెక్టర్ అధ్యక్షతన జరిగిన పీజీఆర్‌ఎస్ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎస్‌ఎస్ శోభిక, సబ్‌కలెక్టర్ ఆర్.వైశాలి, డీఆర్‌ఓ కె.హేమలత, ఎస్‌డీసీ పి.ధర్మచంద్రారెడ్డి, డీఆర్‌డీఏ పీడీ సుధారాణిలు అర్జీదారుల నుంచి మొత్తం 107 అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రతి సమస్యను సావధానంగా పరిశీలించి తగిన పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లాలో ఉన్న పలుశాఖల ఉన్నతాధికారులు, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.
ప్రజలకు జవాబుదారీగా వ్యవహరించండి: ఏఎస్పీ
ప్రజలకు జవాబుదారీగా వ్యవహరించి ఫిర్యాదులకు పరిష్కారం చూపాలని ఏఎస్పీ అంకితా సురానా అన్నారు. ఎస్పీ ఆదేశాల మేరకు సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ఆమె నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదుదారుల నుంచి అర్జీలను స్వీకరించి, అర్జీదారులతో ఏఎస్పీ ముఖాముఖి మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారి ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించి సంబంధిత స్టేషన్ అధికారులకు సిఫార్సు చేశారు. కార్యక్రమంలో 3 ఫిర్యాదులు అందాయి. డీసీఆర్‌బీ ఎస్సై ఫకృద్దీన్ తదితర సిబ్బంది పాల్గొన్నారు.
ఐటీడీఏ పీజీఆర్‌ఎస్‌కు 21 అర్జీలు
సీతంపేట: ఐటీడీఏలో సోమవారం ప్రాజెక్టు అధికారి పవర్ స్వప్నిల్, జగన్నాథ్ నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్)కు 21 అర్జీలు వచ్చాయి. పట్టులోగా ఆశ్రమపాఠశాలలో కుల దూషణపై, ఇతర సంఘటనలపై గ్రూప్‌వన్ అధికారితో విచారణ చేయించాలని స్కూల్ కమిటీ చైర్మన్ సవర లక్ష్మీనారాయణ, గిరిజన సంఘం నాయకులు సవర ధర్మారావు తదితరులు వినతిపత్రం ఇచ్చారు. లాడ గ్రామంలో అంతర్గత సీసీ రహదారులు నిర్మించాలని గ్రామస్తులు కోరారు. తోరికవలసకు నూతన పాఠశాల భవనం నిర్మించాలని పి.లక్ష్మయ్య అర్జీ ఇచ్చారు. వడ్డంగిగూడకు చెందిన రఘు ఆర్‌ఓఎఫ్‌ఆర్ పట్టా ఇప్పించాలని వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఏపీవో చిన్నబాబు, డిప్యూటీఈఓ రామ్మోహన్‌రావు, ఈఈ రమాదేవి, వ్యవసాయాధికారి వాహిని తదితరులు పాల్గొన్నారు.

అర్జీదారుల సమస్యకు తగిన పరిష్కారం చూపండి

అర్జీదారుల సమస్యకు తగిన పరిష్కారం చూపండి