
సైబర్ మోసాలపై అప్రమత్తం
విజయనగరం: సైబర్ మోసాల పట్ల ఖాతాదారులు అప్రమత్తంగా ఉండాలని, గుర్తు తెలియని వ్యక్తులకు ఎటువంటి వ్యక్తిగత సమాచారం చేరవేయవద్దని రిజర్వ్ బ్యాంక్ సీజీఎం సుబ్బయ్య సూచించారు. యూనియన్ బ్యాంక్ ప్రాంతీయ కార్యాలయం ఆధ్వర్యంలో ‘బ్యాంకింగ్ సేవలు – సైబర్ మోసాలపై’ ద్వారపూడి గ్రామంలోని ఫంక్షన్ హాల్‌లో ఆదివారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక పథకాలు, సామాజిక భద్రతా పథకాలను ప్రభుత్వ రంగ బ్యాంక్‌ల ద్వారా వినియోగించుకోవాలని సూచించారు. సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో యూనియన్ బ్యాంక్ జనరల్ మేనేజర్ షాలిని, రిజర్వ్‌బ్యాంక్ డీజీఎం కల్యాణ చక్రవర్తి, యూనియన్ బ్యాంక్ రీజనల్ మేనేజర్ జితేంద్ర శర్మ, ద్వారపూడి సర్పంచ్ అదిలక్ష్మి, ఎంపీటీసీ సభ్యురాలు మృణాళిని, లీడ్ బ్యాంక్ మేనేజర్ వెంకట రమణమూర్తి, యూనియన్ బ్యాంక్ డిప్యూటీ రీజినల్ మేనేజర్లు రాజా, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
రిజర్వ్ బ్యాంక్ సీజీఎం సుబ్బయ్య