హెచ్‌సీ కుటుంబానికి ఆర్థిక సహాయం | - | Sakshi
Sakshi News home page

హెచ్‌సీ కుటుంబానికి ఆర్థిక సహాయం

Aug 7 2025 11:21 AM | Updated on Aug 7 2025 11:21 AM

హెచ్‌సీ కుటుంబానికి  ఆర్థిక సహాయం

హెచ్‌సీ కుటుంబానికి ఆర్థిక సహాయం

డెంకాడ: రోడ్డు ప్రమాదంలో మరణించిన చింతలవలస ఐదవ ఏపీఎస్‌పీ బెటాలియన్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ కోరాడ రామునాయుడు కుటుంబానికి పోలీస్‌ వాట్సాప్‌గ్రూప్‌ సభ్యులు రూ.లక్షా 50వేల 662ల ఆర్థిక సహాయం చేశారు. ఏపీ పోలీస్‌ వాట్సాప్‌ గ్రూపులోని సభ్యులు వితరణగా ఇచ్చిన మొత్తాన్ని మృతుడు హెచ్‌సీ రామునాయుడు కుటుంబ సభ్యులకు బుధవారం అందజేశారు. కార్యక్రమంలో గ్రూపు సభ్యులు లెంక రాము, మిత్తిరెడ్డి అప్పలనాయుడు, శీర గణేష్‌, అక్కుపల్లి గోవింద, మజ్జి కూర్మారావు, గొర్లె శ్రావణ్‌కుమార్‌, మీసాల చంద్రమౌళి, కల్యాణపు అప్పలనాయుడు, వైస్‌ ఎంపీపీ పిన్నింటి తమ్మునాయుడు తదితరులు పాల్గొన్నారు.

16న రాష్ట్రస్థాయి క్విజ్‌ పోటీలు

కొత్తవలస: మండలంలోని అప్పన్నపాలెం గ్రామంలో శ్రీ కృష్ణాష్టమి సందర్భంగా 16వ తేదీన రాష్ట్రస్థాయి క్విజ్‌ పోటీలను నిర్వహించ నున్నట్లు ఉత్తరాంధ్ర క్విజ్‌ మాస్టర్‌ కర్రి రాము బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పోటీలు 16వ తేదీన ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతాయన్నారు.అన్ని రకాల పోటీ పరీక్షలు రాసేందుకు ప్రిపేర్‌ అవుతున్న అభ్యర్థులు అర్హులని తెలిపారు . ఆరుగురు అభ్యర్థులు ఒక గ్రూప్‌గా ఏర్పండి పోటీల్లో పాల్గొన వచ్చన్నారు. హైటెక్‌ విజయరహస్యం–2025 మ్యాగజైన్‌, ఇంగ్లీష్‌, కరెంట్‌ అఫెర్స్‌ తదితర అంశాలపై పోటీలు ఉంటాయన్నారు. పోటీల్లో గెలుపొందిన గ్రూప్‌లకు వరుసగా రూ.5వేలు, రూ.4వేలు, రూ 3వేలు, రూ.2వేలు నగదు బహుమతి ప్రదానం చేయనున్నట్లు తెలిపారు.ఈ పోటీలు గ్రామ మాజీ సర్పంచ్‌ తిక్కాన చిన్నదేముడు ఆర్థిక సహాయంతో నిర్వహించనున్నట్లు చెప్పారు.

9న జిల్లా స్థాయి యోగా పోటీలు

విజయనగరం: జిల్లా యోగా అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఈనెల 9న జిల్లా స్థాయి యోగా పోటీలు నిర్వహించనున్నట్లు అసోసియేషన్‌ అధ్యక్షుడు అవనాపు విక్రమ్‌ బుధవారం తెలిపారు. ఆ రోజు ఉదయం 8 గంటలకు విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్‌ సమీపంలో గల తోటపాలెం గాయత్రి టెక్నో స్కూల్‌లో ఎంపిక పోటీలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. సబ్‌జూనియర్‌, జూనియర్‌, సీనియర్స్‌ విభాగాల్లో 8 నుంచి 50 సంవత్సరాల మధ్య వయస్సు గల వారికి ఎంపికలు జరుగుతాయని తెలిపారు. పోటీలకు హాజరయ్యే క్రీడాకారులు తమ పేర్లను 8వ తేదీ సాయంత్రం లోగా నమోదు చేసుకోవాలని సూచించారు. జిల్లా స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు పశ్చిమగోదావరి జిల్లా, తాడేపల్లిగూడెంలో నిర్వహించే రాష్ట్రస్థాయి యోగా పోటీల్లో పాల్గొంటారని, రాష్ట్రస్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారు, మైసూర్‌ (కర్ణాటక)లో నిర్వహించే జాతీయస్థాయి యోగా పోటీల్లో పాల్గొంటార ని వివరించారు. జిల్లా స్థాయి యోగా పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు పేర్ల నమోదు, మరిన్ని వివరాలకు ఫోన్‌ 8374904262,7993696087 నంబర్లను సంప్రదించాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement