
తీరంలో.. అలెర్ట్
● నాలుగు రోజులుగా నిలిచిన చేపల వేట
● మత్స్యకార గ్రామాలను సందర్శించిన అధికారులు
పూసపాటిరేగ: తీరప్రాంత గ్రామాల్లో ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. గడిచిన నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వలలు, బోట్లు సురక్షిత ప్రాంతాలకు తరలించి మత్స్యకారులు ఇంటికే పరిమితమయ్యారు. రెవెన్యూ, మత్స్యశాఖ అధికారులు తీరంలో పర్యటించి ప్రజలను అప్రమత్తం చేసి సురక్షితంగా ఉండాలని కోరారు. ఎంపీడీఓ ఎం.రాధిక కోనాడ గ్రామంలో పర్యటించారు. కోనాడ సెలయేరు వద్ద చంపావతినది నుంచి నీటి ప్రవాహం ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్నందున గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. చింతపల్లి, తిప్పలవలస గ్రామాల్లో తహసీల్దార్ ఎన్‌వీ రమణ పర్యటించి మత్స్యకారులతో సమావేశమై పలు సూచనలు చేశారు.

తీరంలో.. అలెర్ట్