–8లో
జీవి చిన్నదే.. ప్రమాదం పెద్దది
పార్వతీపురం మన్యం జిల్లాలో దోమలు విజృంబిస్తున్నాయి. మలేరియా, డెంగీలతో పాటు అక్కడక్కడ చికెన్‌గున్యా వంటి జ్వరాలు
వ్యాప్తి చెందుతున్నాయి.
పూసపాటిరేగ/జామి: దివ్యాంగుల పింఛన్ల తొలగింపు అన్యాయమంటూ జిల్లా వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు కొనసాగుతున్నాయి. పలు ఎంపీడీఓ కార్యాలయాల వద్ద దివ్యాంగులు మంగళవారం ఆందోళనలు చేశారు. ఏళ్ల తరబడి పొందుతున్న పింఛన్‌ను రద్దుచేయడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. కూటమి ప్రభుత్వ తీరును దుమ్మెత్తిపోశారు. పింఛన్లు పెంచినట్టే పెంచి రద్దుచేయడం ఎంతవరకు సమంజసం ‘బాబూ’అంటూ ప్రశ్నించారు. పింఛన్లు పునరుద్ధరించాలంటూ ఎంపీడీఓలకు వినతిపత్రాలు అందజేశారు.
ఇది అన్యాయం
దివ్యాంగుల పింఛన్లు తొలగించడం అన్యాయమని వైఎస్సార్‌సీపీ జామి మండల కన్వీనర్ గొర్లె రవికుమార్, జెడ్పీటీసీ గొర్లె సరయు, ఎంపీపీ సబ్బవరపు అరుణ అన్నారు. కూటమితీరుకు నిరసనగా జామి ఎంపీడీఓ కార్యాలయం వద్ద దివ్యాంగులతో కలిసి మంగళవారం ఆందోళన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అధికారంలోకి వచ్చాక అర్హుల కు పింఛన్ మంజూరు చేయకుండా ఉన్నవి తొలగించడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. గతంలో వైద్యులు మంజూరు చేసిన సదరం ధ్రువపత్రం ఆధారంగానే పింఛన్లు పొందుతున్న విషయాన్ని గుర్తించాలన్నారు. రీ సర్వే పేరుతో అర్హుల పింఛన్లు తొలగించడం ఆవేదన కలిగిస్తోందన్నారు. పింఛన్‌ను రద్దుచేస్తే దివ్యాంగుల జీవనం ప్రశ్నార్థకంగా మారుతుందన్నారు. నోటీసులతో దివ్యాంగుల గుండెల్లో దడపుట్టించడం తగదన్నారు. పింఛన్లు రద్దుచేస్తే పార్టీ తరఫున న్యాయపోరాటం చేస్తామన్నారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ గేదెల వెంకటరావు, నేతలు చలమూరి సత్యారావు, ఎ.సుబ్రహ్మణ్యం, సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు.
పింఛన్ల తొలగింపుపై నిరసన