
అందివస్తాడనుకుంటే అనంతలోకాలకు...
సంతకవిటి: డిగ్రీ విద్య పూర్తిచేసి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న కుమారుడు ఉద్యోగం సాధిస్తే కష్టాలు గట్టెక్కుతాయని ఆ తల్లిదండ్రులు భావించారు. చివరికి ఉద్యోగం కోసం సాగించే పరుగులోనే కుమారుడు కుప్పకూలి ప్రాణాలు విడవడంతో బోరున విలపిస్తున్నారు. సంతకవిటి మండలం శ్రీహరినాయుడుపేట గ్రామానికి చెందిన గండ్రేటి సాయికిరణ్(20) మంగళవారం కాకినాడలో జరిగిన అగ్నిపథ్ ర్యాలీలో 1600 మీటర్ల పరుగుపందెంలో పాల్గొని ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అక్కడి సిబ్బంది కాకినాడలోని జీజేహెచ్‌లో చేర్పించినా ఫలితం లేకపోయింది. కుమారుడి మృతివార్త తెలుసుకున్న తల్లిదండ్రులు అప్పన్న, భారతిలు కాకినాడ బయలుదేరి వెళ్లారు. వీరికి సాయికిరణ్‌తో పాటు ఇంటర్ చదువుతున్న కుమార్తె ఉంది. అందివస్తాడనుకున్న కొడుకు తిరిగిరాని లోకాలకు చేరుకోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. గ్రామంలో విషాదం అలముకుంది.
● శోక సంద్రంలో
శ్రీహరినాయుడుపేట