
నదిలో గాలింపు
● లభించని వృద్ధుని ఆచూకి
సంతకవిటి: మండలంలోని పోడలి గ్రామానికి చెందిన ఉరదండం పోలయ్య(76) ఆదివారం నాగావళి నదిలో కొట్టుకుపోయిన విషయం తెలిసిందే. నదిలో నీరు ఉద్ధృతంగా ఉండండతో గాలింపు చర్యలకు అంతరాయం కలుగుతోంది. నది ఉద్ధృతి మంగళవారం కాస్త తగ్గడంతో ఎస్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది గాలింపును ముమ్మరం చేశారు. చీకటిపడే సమయానికి ఆచూకీ లభించలేదు.
పోక్సోకేసు నమోదు
బకాయిలు ఇంకెప్పుడు చెల్లిస్తారు..?
బొబ్బిలి: ఉద్యోగ,ఉపాధ్యాయులకు, పింఛన్‌దారులకు సంబంధించిన ఆర్థిక బకాయిలను వెంటనే చెల్లించాలని ఏపీటీఎఫ్ రాష్ట్ర అకడమిక్ కన్వీనర్ జె.సి.రాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్థానిక ఏపీటీఎఫ్ కార్యాల యంలో ఏపీటీఎఫ్ కార్యవర్గ సభ్యుల అత్యవసర సమావేశాన్ని మంగళవారం ఏర్పాటు చేశారు. ఈసంద ర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి అధి కారం చేపట్టి 15 నెలలుకావస్తున్నా ఉద్యోగ, ఉపాధ్యాయులు, పింఛన్‌దారుల సమస్యలను కనీసం పట్టించుకోవడం లేదన్నారు. రూ.23వేల కోట్ల బకాయిలను అధికారం లోకి వచ్చిన వెంటనే చెల్లిస్తామని ఎన్నికల ముందు కూటమి పెద్దలు చెప్పారని, ఇప్పుడు పట్టించుకోవడం లేదని వాపోయారు. కనీసం ఒక్క కరువు భత్యాన్ని కూడా విడుదల చేయకపోవడం దారుణమన్నారు. ఇది ప్రభుత్వ ఉదాసీనత కాక మరేమిటన్నారు. అనేక పర్యాయాలు విజ్ఞప్తులు చేసినా బకాయిల విడుదల విషయంలో స్పందించకపోవడం శోచనీయమన్నారు. కేబినెట్ సమావేశాల్లో చర్చించకపో వడం దారుణమని, దీని వల్ల ప్రభుత్వంపై విశ్వాసం సన్నగిల్లుతోందన్నారు. వెంటనే బకాయిలను చెల్లించి ప్రభుత్వం తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని కోరారు. ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డులను లీప్‌యాప్‌ను ఆధారం చేసుకుని గుర్తించడం సరికాదన్నారు. బోధన, సామాజిక సేవ, విద్యాభివృద్ధి వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని అవార్డులను ఇవ్వాలన్నారు. మూల్యాంకన ప్రక్రియ ఉపాధ్యాయులకు పెనుభారమైందని, పునరాలోచన చేయాలని కోరారు. ఏపీటీఎఫ్ జిల్లా గౌరవాధ్యక్షుడు బంకురు జోగినాయుడు, మండల అధ్యక్షుడు సీహెచ్. జె. ప్రవీణ్‌కుమార్, ఆర్.ఎన్.రాజు, సభ్యులు పాల్గొన్నారు.

నదిలో గాలింపు