
భారీ వర్షాలపై అప్రమత్తం
● ఎంపీ తనూజారాణి
పాలకొండ: పార్వతీపురం మన్యం జిల్లాలో భారీ వర్షాలు పడుతున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని అరకు ఎంపీ గుమ్మ తనూజారాణి ఒక ప్రకటనలో కోరారు. పార్లమెంట్ సమావేశాల్లో ఉన్న ఆమె సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. పూర్తి ఏజెన్సీతో కలిగి ఉన్న ప్రాంతంలో ఎటువంటి ప్రమాదం జరగకుండా చర్యలు తీసుకోవాల్సి ఉందన్నారు. ఇందుకోసం కలెక్టర్‌ను ఫోన్‌లో సంప్రదించి చేపట్టవలసి చర్యలు వివరించామని పేర్కొన్నారు. ప్రధానంగా నదీతీర గ్రామాల్లో ప్రజల ను అప్రమత్తం చేయాలని సూచించారు. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రతి మండలంలోను కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని చెప్పారు. రైతుల పంటలకు, పశు సంపదకు నష్టం కలగకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. చెరువులు, కాలువలకు గండ్లు పడే అవకాశం ఉందని ఈ పరిస్థితుల్లో ముందుగానే వాటిని గుర్తించి జాగ్రత్తలు తీసుకోవాలని, అత్యవసర సమయంలో కలెక్టర్ కమాండ్ కంట్రోల్ రూమ్ నంబర్ 08963293046కు సంప్రదించాలని స్పష్టం చేశారు.