
అంగన్‌వాడీ కేంద్రాలకు కుళ్లిన గుడ్లు
విజయనగరం ఫోర్ట్: విజయనగరం పట్టణంలోని పలు అంగన్‌వాడీ కేంద్రాలకు కుళ్లిన గుడ్లు సరఫరా చేయడంపై సిబ్బంది ఆందోళన వ్యక్తంచేశారు. కుళ్లిన గుడ్లను బయటపడేశారు. విజయనగరం అర్బన్ ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో 300 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో కొన్నింటికి కుళ్లిన గుడ్లు సరఫరా అయ్యాయి. గుడ్లును కాంట్రాక్టర్ సరఫరా చేసినప్పుడు సూపర్ వైజర్, సీడీపీఓ పర్యవేక్షించకపోవడమే దీనికి కారణమన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కుళ్లిన గుడ్లు సరఫరా చేయడంవల్ల లబ్ధిదారులకు కోతపడే అవకాశం ఉంది. ఇదే విషయాన్ని అర్బన్ సీడీపీఓ ప్రసన్న వద్ద ‘సాక్షి’ ప్రస్తావించగా పరిశీలించి చర్యలు తీసుకుంటామన్నారు.
డీఎస్‌ఓగా మురళీనాథ్
విజయనగరం ఫోర్ట్: జిల్లా పౌర సరఫరాల అధికారిగా మురళీనాథ్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ ఇప్పటివరకు డీఎస్‌ఓగా పనిచేసిన మధుసూదనరావు ఉద్యోగవిరమణ పొందారు. ఈ సందర్భంగా డీఎస్‌ఓ మాట్లాడుతూ లబ్ధిదారులందరికీ రేషన్ సరుకులు అందేలా కృషి చేస్తానన్నారు. రేషన్ పంపిణీలో ఇబ్బందులు లేకుండా చూస్తానని తెలిపారు. గ్యాస్ రాయితీ పొందలేని వారు ఆధార్ అప్‌డేట్ చేసుకోవాలన్నారు.
13 మంది సచివాలయ సిబ్బందికి షోకాజ్ నోటీసులు
విజయనగరం అర్బన్: విధులు సకాలంలో నిర్వహించలేదనే ఆరోపణపై జిల్లాలోని 13 మంది సచివాలయ సిబ్బందికి బుధవారం షోకాజ్ నోటీసులను జిల్లా అధికారులు జారీచేశారు. నిర్దేశించిన రోజుల్లో చేపట్టాల్సిన వివిధ సేవలపై ప్రచారం, వర్క్ ఫ్రమ్ హోం సర్వే, పీ–4 మార్గదర్శకుల సేకరణ వంటి విధులను సకాలంలో నిర్వహించలేదని నోటీస్‌లో కారణం చూపారు. దీనిపై సచివాలయ సిబ్బంది ఆవేదన చెందుతున్నారు. పింఛన్ల పంపిణీతో పాటు వివిధ ప్రభుత్వ సర్వేలతో తీరిక లేకుండా పనిచేస్తుంటే నోటీసులు ఇవ్వడం ఎంతమేర సమంజసమని ప్రశ్నిస్తున్నారు.
మహిళలకు రక్షణ
విజయనగరం ఫోర్ట్: గృహహింసకు గురికాబడిన మహిళలకు జిల్లా సీ్త్ర, శిశు సంక్షేమ, సాధికారత అధికారితో పాటు సోషల్ కౌన్సిలర్, లీగల్ కౌన్సిలర్, డేటా ఆపరేటర్, పోలీస్‌శాఖ నుంచి ఇద్దరు హోంగార్డ్స్ రక్షణ కల్పిస్తారని సీ్త్ర, శిశుసంక్షేమ శాఖ అధికారి టి.విమలారాణి తెలిపారు. సంబంధిత శాఖ కార్యాలయం కలెక్టరేట్‌లో ఉందన్నారు. గృహహింసకు గురైన మహిళలు కార్యాలయాన్ని సంప్రదించవచ్చన్నారు.

అంగన్‌వాడీ కేంద్రాలకు కుళ్లిన గుడ్లు