ఐఆర్‌సీటీసీ సేవలను సద్వినియోగం చేసుకోండి
విజయనగరం టౌన్: ఈస్ట్‌కోస్ట్ రైల్వే డివిజన్ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రయాణికులు ఐఆర్‌సీటీసీ అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఐఆర్‌సీటీసీ ప్రాంతీయ చైర్మన్ అనూజ్ దత్త (భువనేశ్వర్) పేర్కొన్నారు. స్థానిక రైల్వే వీఐపీ లాంజ్‌లో ఆయన గురువారం మాట్లాడుతూ ఐఆర్‌సీటీసీ అందిస్తున్న పలు ప్యాకేజీలను వివరించారు. శ్రీలంక పర్యటనలో భాగంగా శాంకరీదేవి శక్తిపీఠంతో పాటు పలు ఆలయాల సందర్శన చేసే వారికి ఈ నెల 28 నుంచి జూలై మూడో తేదీ వరకు ఎయిర్ ప్యాకేజీలతో పర్యటన ఉందన్నారు. సెప్టెంబర్ 12 నుంచి 18వ తేదీ వరకు కేరళ, ఆగస్టు 14 నుంచి 23వ తేదీ వరకు గుజరాత్‌లోని పుణ్యక్షేత్రాలు, స్టాట్యూ ఆఫ్ యూనిటీ, అక్ష రధామ్ ద్వారక, జ్యోతిర్లింగ యాత్రలు ఉంటాయన్నారు. వివరాలకు సెల్: 92810 30748, 92814 95847 నంబర్లను సంప్రదించాలని కోరారు.


