అనాఽథ, నిరాశ్రయ బాలబాలికలకు ‘ఆధార్’
విజయనగరం లీగల్: జాతీయ న్యాయ సేవ అధికా ర సంస్థ ఉత్తర్వులతో జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.బబిత ఆధ్వర్యంలో బుధవారం జిల్లా కోర్టు కాన్ఫరెన్స్ హాల్లో నిరాశ్రయులు, అనాఽథలైన బాల బాలికలకు ఆధార్ కార్డులు జారీ చేసే బృహత్తర కార్యక్రమం ప్రారంభించారు. అనంతరం విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాలో ఉన్న రెవె న్యూ అధికారులు, పోలీస్ అధికారులు డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ అధికారులు, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు చిల్డ్రన్ హోమ్, ఎన్జీవో హోమ్‌లకు సంబంధించిన నిర్వాహకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నిరాశ్రయులైన బాలబాలికలకు ఆధార్ కార్డులు జారీ చేయడానికి తగిన చర్యల ప్రణాళికను వివరించారు. బుధవా రం నుంచి జూన్ 25 వరకు సర్వే నిర్వహించి వారి వివరాలను సేకరించాలని అన్నారు. జూన్ 26 నుంచి ఆగస్టు ఐదవ తేదీలోపు వారి వివరాలు రిజిస్ట్రేష న్ కార్యక్రమం నిర్వహించాలని, ఆగస్టు 15వ తేదీకల్లా ఈ నివేదికలను జాతీయ న్యాయ సేవ అధికా ర సంస్థకు పంపించాలని సూచించారు. దీని కోసం జిల్లా స్థాయిలో (ఎస్‌ఏఏటీఐ) కమిటీలను ఏర్పాటు చేసి వారికి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ బృహత్తర కార్యక్రమాన్ని సమన్వయంతో సమష్టిగా విజయవంతం చేయాలని కోరారు. జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి ఎ.కృష్ణప్రసాద్, రెండు జిల్లాలో ఉన్న పోలీస్ అధికారులు, రెవెన్యూ అధికారులు, స్వచ్ఛంద సంస్థలు, ఇతర అధికారు లు, ప్యానల్ న్యాయవాదులు, పారా లీగల్ వాలంటీర్లు పాల్గొన్నారు.


