వెబ్‌సైట్‌లో జీడీఏ ప్రొవిజినల్ మెరిట్ జాబితా
విజయనగరం ఫోర్ట్: ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి, ప్రభుత్వ వైద్య కళాశాలలో పోస్టుల భర్తీకి సంబంధించి జనరల్ డ్యూటీ అటెండెంట్ పోస్టుల ప్రొవిజినల్ మెరిట్ జాబితా విజయనగరం.ఎన్‌ఐసి.ఇన్ వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్టు ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె.పద్మలీల శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ జాబితాపై అభ్యంతరాలుంటే ఈ నెల 31వ తేదీలోగా తెలియజేయాలన్నారు.
‘కంచరగెడ్డ’ ఆక్రమణల తొలగింపు
● హెచ్చరిక బోర్డులు ఏర్పాటుచేసిన రెవెన్యూ అధికారులు
బొబ్బిలి రూరల్: మండలంలోని కాశిందొరవలస గ్రామ రెవెన్యూ పరిధి కంచరగెడ్డ జలాశయ భూముల ఆక్రమణలను రెవెన్యూ అధికారులు తొలగించారు. టీడీపీ నాయకుడు దురాక్రమణకు పాల్పడిన భూమిలో హెచ్చరిక బోర్డులు ఏర్పాటుచేశారు. జలాశయం భూముల ఆక్రమణపై ఈ నెల 20న ‘కంచరగెడ్డ దురాక్రమణ’ శీర్షికన ‘సాక్షి’లో ప్రచురితమైన వార్తకు తహసీల్దార్ ఎం.శ్రీను స్పందించారు. ఆక్రమణలను శుక్రవారం పరిశీలించారు. జలాశయంలోని భూములు ప్రభుత్వానికి చెందినవని, వీటిని ఆక్రమించేవారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆక్రమిత భూమిలో సాగుకు ప్రయత్నిస్తే క్రిమినల్ కేసులు పెడతామన్నారు. ఈ మేరకు సిబ్బందితో హెచ్చరిక బోర్డును ఏర్పాటుచేయించారు.
కోటిపాం వంతెనపై వినూత్న నిరసన
కొమరాడ: పార్వతీపురం నుంచి కూనేరు వెళ్లే అంతర్ రాష్ట్ర రహదారి పూర్తిగా గోతులు మయం అయింది. వాహన చోదకులు నరకయాతన అనుభవిస్తున్నారు. వాహనాలు తరచూ మరమ్మతుల కు గురై రోడ్డు మధ్యలో నిలిచిపోవడంతో ట్రాఫిక్ సమస్య తలెత్తుతోంది. 1933లో నిర్మించిన ఈ వంతెన శిథిలావస్థకు చేరినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. దీనికి నిరసనగా సీపీఎం నాయకు డు కొల్లు సాంభమూర్తి వంతెనపై గోతుల్లో చేరిన వర్షపునీటిలో శుక్రవారం స్నానం చేసి వినూత్న రీతిలో నిరసన తెలిపారు. మూడు రాష్ట్రాల ప్రజ లు, వాహనాల రాకపోకలకు ఆధారమైన కోటి పాం వంతెన కూలేపోయే దశలో ఉన్నా పట్టించుకోకపోవడంపై మండిపడ్డారు. పాలకులు, అధికా రులు కళ్లుతెరిచి చూడాలని కోరారు. కనీసం గోతులను పూడ్చే ఏర్పాట్లైనా చేయాలని డిమాండ్ చేశారు.
వెబ్‌సైట్‌లో జీడీఏ ప్రొవిజినల్ మెరిట్ జాబితా


