
● పింఛన్ కష్టాలు
చిత్రంలో ఎండకు సొమ్మసిల్లి ముఖం కడుగుతున్న వృద్ధురాలి పేరు బొడబళ్ల సూరమ్మ. గంట్యాడ మండలం శ్రీరాంపురం. ఆమె వయస్సు 80 సంవత్సరాలు. పింఛన్ రీ వెరిఫికేషన్ కోసం నోటీస్ ఇవ్వడంతో ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి బుధవారం వచ్చింది. ఎండతీవ్రత తట్టుకోలేక టెంటు వద్దనే సొమ్మసిల్లి పడిపోయింది. వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను పైకిలేపి నీటితో ముఖం కడిగించారు. కాసేపు టెంటులో కూర్చోబెట్టి డాక్టర్ వద్దకు తీసుకెళ్లారు. జ్వరంతో బాధపడుతున్నా పింఛన్ తొలగిస్తారన్న భయంతో ఆస్పత్రికి వచ్చానని, ఈ వయస్సులో మా లాంటి వృద్ధులను ఇక్కట్లకు గురిచేయడం తగదంటూ వృద్ధురాలు వాపోయింది. కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత దివ్యాంగులకు పింఛన్ పాట్లు తప్పడంలేదంటూ అక్కడివారు నిట్టూర్చారు. నడవలేని, రెండు కళ్లు కనిపించని అంధులను కూడా ఆస్పత్రులకు
తిప్పుతున్నారంటూ వాపోయారు.
– విజయనగరం ఫోర్ట్