
ముగిసిన జిల్లా స్థాయి టెన్నిస్ చాంపియన్‌షిప్
విజయనగరం: విజయనగరం సిటీ క్లబ్ ఆవరణలో రెండురోజుల పాటు కొనసాగిన జిల్లా స్థాయి పోటీలు ఆద్యంతం ఆహ్లాదకరమైన వాతావరణలో సాగి సోమవారం ముగిశాయి. ఈ పోటీల్ల క్రీడాకారులు ఉత్తమమైన ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. ఐదు విభాగాల్లో జరిగిన ఈ పోటీల్లో దాదాపు అరవై మంది క్రీడాకారులు పాల్గొన్నారు. అండర్ 12, అండర్ 16, అండర్ 30, 40, 50 విభాగాల్లో పోటీలకు సిటీ క్లబ్ ఆతిథ్యం ఇచ్చింది. క్రీడాకారుల నుంచి ఎటువంటి ఎంట్రీ ఫీజ్ వసూలు చేయకుండా వారిని ప్రోత్సహించేందుకు నిర్వాహకులు టెన్నిస్ పోటీలు నిర్వహించి విజేతలకు చాంపియన్ షిప్ ట్రోఫీలు, సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా విజయనగరానికి టెన్నిస్ క్రీడకు ఉన్న సంబంధాన్ని అంతా మననం చేసుకున్నారు. ప్రతి ఏడాది దివంగత నారాయణ దొర, ముద్దుబాబు, బాబ్జీలు జాతీయస్థాయి పోటీలను క్రమం తప్పకుండా నిర్వహించేవారని గుర్తుచేశారు. వారి స్ఫూర్తితో సిటీ క్లబ్ అధ్యక్షుడు రంగబాబు, జాతీయ టెన్నిస్ మాజీ కోచ్ సన్నిబాబు, శ్రీను, శివాజీల చొరవతో ఈ ఏడాది జిల్లాస్థాయి టెన్నిస్ చాంపియన్ షిప్ పోటీలను నిర్వహించామని వైభవ్, సాత్విక్, కౌశిక్ కోచ్ గౌరీశంకర్, రామారావు పోటీల ముగింపు కార్యక్రమంలో తెలిపారు. త్వరలో మరిన్ని పోటీలను నిర్వహిస్తామన్నారు. అతి తక్కువ ఫీజ్ తో సిటీ క్లబ్ ఆవరణలో టెన్నిస్ శిక్షణ ఇస్తున్నామని చిన్నారులు ఈ అవకాశం వినియోంచుకోవాలని కోచ్ గౌరీశంకర్ తెలిపారు.