కూటమి కుట్రలు! | - | Sakshi
Sakshi News home page

కూటమి కుట్రలు!

Apr 13 2025 1:27 AM | Updated on Apr 13 2025 1:27 AM

కూటమి

కూటమి కుట్రలు!

చిరుద్యోగులపై కొనసాగుతున్న

గంట్యాడ: చిరుద్యోగులపై కూటమి కుట్రలు కొనసాగుతున్నాయి. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చిరుద్యోగుల తొలగింపే లక్ష్యంగా పని చేస్తున్నారు. ముఖ్యంగా మంత్రి కొండపల్లి ఇలాఖాలో కూటమి నేతలు రెచ్చిపోతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే పలువురు చిరుద్యోగులను తొలగించారు. కేజీబీవీల్లో పని చేసే కుక్‌, వాచ్‌మన్‌లను, పాఠశాలల్లో పని చేసే ఆయాలు, వాచ్‌మన్‌లు, ఉపాధి పథకంలో పనిచేసే ఫీల్డ్‌ అసిస్టెంట్లను తొలగించారు. మండలంలో ఇప్పటికే 15 మంది వీఓఏలను తొలగించారు. తాజాగా పెణసాం వీఓఏ(గ్రామైఖ్య సంఘం సహాయకురాలు)ను కూడా తొలగించారు. పెణసాం గ్రామంలో ఇటీవల జరిగిన శ్రీరామనవమి వేడుకల్లో కూడా కూటమి నేతలు పెద్ద రచ్చే చేశారు. పెణసాం వీఓఏ సుంకరి సన్యాసమ్మ(ఇందిర) గడిచిన 14 ఏళ్లుగా పని చేస్తుంది. ఇప్పుడు ఆమెను తొలగించి ఆ స్థానంలో వేరే మహిళను నియమించేందుకు కూటమి నేతలు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో గ్రామంలో ఉన్న పొదుపు సంఘాల అధ్యక్షులు అంతా ఒక్కటై సన్యాసమ్మ వీఓఏగా బాగానే పని చేస్తున్నారని, సంతృప్తికరంగా సేవలు అందిస్తుందని, ఆమెనే కొనసాగించాలని తీర్మానించారు. అయినా అధికారులు వారి అభిప్రాయాలను పట్టించుకోలేదు.

తొలగింపు ఉత్వర్వులు ఇవ్వరట..!

ఏదైనా ఉద్యోగిని విధుల నుంచి తొలిగిస్తే ఏ కారణం చేత తొలగిస్తున్నారో.. ఉత్తర్వులు ఇస్తారు. కానీ వెలుగు అధికారులు మాత్రం తొలగింపు ఉత్తర్వులు ఇవ్వలేమని చెబుతున్నారు. దీనిపై తీవ్రమైన విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తొలగింపు ఉత్తర్వులు ఉంటే న్యాయ పోరాటం చేసేందుకు, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లేందుకు అవకాశం ఉంటుంది. అందుకే ఇలా చేస్తున్నారని చెబుతున్నారు.

పెణసాం వీఓఏ తొలగింపు

ఆమెను కొనసాగించాలని పొదుపుల సంఘాల తీర్మానం

అయినా తొలగించిన వైనం

మంత్రి కొండపల్లి ఇలాఖాలో తీరిది!

తొలగించాం.. రికార్డులివ్వమని చెప్పారు...

నేను 14 సంవత్సరాలుగా వీఓఏగా పని చేస్తున్నాను. పొదుపు సంఘాల మహిళల అందరికీ సంతృప్తికర సేవలు అందిస్తున్నాను. వెలుగు సీసీ నిన్ను తొలగించాం.. నీ స్థానంలో వేరొకరిని నియమిస్తాం.. రికార్డులు అప్పగించమని చెప్పారు. ఇలా తొలగిస్తే ఎలా జీవించేది.

– సుంకరి సన్యాసమ్మ, వీఓఏ, పెణసాం

వీఓఏను తొలగించాం..

పెణసాం వీఓఏను తొలగించాం. వీఓఏలను తొలగింపు ఉత్తర్వులు అంటూ ఏమీ ఇవ్వం. ఇది నిబంధనల మేరకే చేశాం.

– కోరుకొండ సులోచనదేవి, ఏపీఎం, వెలుగు

కూటమి కుట్రలు!1
1/2

కూటమి కుట్రలు!

కూటమి కుట్రలు!2
2/2

కూటమి కుట్రలు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement