
చికెన్
బ్రాయిలర్ లైవ్ డ్రెస్‌డ్ స్కిన్‌లెస్ శ్రీ130 శ్రీ230 శ్రీ240
పైడితల్లి చండీయాగం
విజయనగరం టౌన్: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి శ్రీ పైడితల్లి అమ్మవారు జన్మ నక్షత్రమైన మూలా నక్షత్రం పురస్కరించుకుని శనివారం చదురుగుడి, వనంగుడి ఆలయ ప్రాంగణంలో చండీయాగం ప్రక్రియను వేదపండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆలయ వేదపండితులు సాయికిరణ్, దూసి శివప్రసాద్, వెలువలపల్లి నరసింహమూర్తి, తాతా రాజేష్‌లు యాగప్రక్రియను నిర్వహించి, యాగ విశిష్టతను భక్తులకు వివరించారు. అనంతరం అమ్మవారి శేష వస్త్రాలను, ప్రసాదాలను భక్తులకు అందజేశారు. కార్యక్రమాలను ఆలయ ఈఓ కెఎన్‌విడివి.ప్రసాద్ పర్యవేక్షించారు.
అమ్మవారికి గోరింటాకుతో అర్చన
విజయనగరం టౌన్: నగరంలోని సిటీ బస్టాండ్ వద్దనున్న అభయాంజనేయస్వామి ఆలయంలో కొలువైన శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారికి ఆలయ ప్రధాన అర్చకులు వికె.గాయత్రీ శర్మ ఆధ్వర్యంలో శనివారం గోరింటాకుతో అర్చనలు నిర్వహించారు. చైత్ర మాస పౌర్ణమి పురస్కరించుకుని అమ్మవారికి సహస్ర కుంకుమార్చనలు, నక్షత్ర హారతులు నిర్వహించారు. కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
రోడ్డు ప్రమాదంలో
యువకుడి దుర్మరణం
గంట్యాడ: రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే.. ఒడిశా రాష్ట్రం కోరాపుట్ జిల్లా బొందిగామ మండలం అలమండ గ్రామానికి చెందిన అలిబిల్లి నాని( 20) విజయనగరంలోని ఓ ప్రైవేటు కళాశాలలో బీఎస్సీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. శుక్రవారం తనతో పాటు మరో ఐదుగురు స్నేహితులతో కలిసి ద్విచక్ర వాహనాలపై గంట్యాడ మండలం తాటిపూడి రిసార్ట్‌కు పికినిక్‌కు వెళ్లారు. అర్థరాత్రి 12 గంటల సమయంలో అక్కడ నుంచి బయలుదేరి విజయనగరం వస్తుండగా గింజేరు దాటిన తర్వాత గ్రీన్ ఫీల్డ్ హైవే గ్రిల్స్‌ను ఢీకొట్టడంతో నానితో పాటు బైక్‌పై వెనుక కూర్చొన్న వంశీకృష్ణకు తీవ్ర గాయాలయ్యాయి. ఇద్దరిని అంబులెన్సులో ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు. నాని అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. మృతుడికి తల్లిదండ్రులు, సోదరి ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఇంచార్జ్ ఎస్‌ఐ అశోక్‌కుమార్ తెలిపారు.
కళ్లల్లో కారం కొట్టి
పుస్తెలతాడు అపహరణ
రాజాం సిటీ: పట్ట పగలు మహిళ కళ్లల్లో కారంకొట్టి పుస్తెలతాడు అపహరించుకుపోయిన ఘటన మండల పరిధి పొగిరి గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన జడ్డు చిన్నమ్మడు ఉదయం 7గంటల సమయంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వెనుకభాగంలో ఉన్న తన కళ్లంలో ఆవులకు మేత వేస్తుంది. ఆ సమయంలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తి బైక్‌పై వచ్చాడు. ఆమె వద్దకు వెళ్లి తన చేతిలో ఉన్న కారం ఆమె ముఖంపై చల్లి మెడలోని 38 గ్రాముల బంగారు పుస్తెలతాడును లాక్కున్నాడు. అప్రమత్తమైన ఆమె పెనుగులాడినప్పటికీ ప్రయోజనం లేక కేకలు వేసింది. ఆమె కేకలు విని అక్కడకు చేరుకున్న తన భర్త నరేంద్రతో పాటు మరికొంత మందికి విషయం చెప్పంది. వెంటనే పుస్తెలతాడు అపహరించుకుపోయిన వ్యక్తి రాజాం వైపు వెళ్తున్నాడని గమనించి వెంబడించినప్పటికీ ప్రయోజనం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే అప్రమత్తమైన సీఐ కె.అశోక్‌కుమార్ ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేయడంతో పాటు తన సిబ్బందితో గాలింపు చర్యలు చేపట్టారు. సంఘటన జరిగిన ప్రాంతానికి దగ్గర్లో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించడంతో పాటు గ్రామస్తుల వద్ద ఘటనకు సంబంధించి వివరాలు సేకరించారు.

చికెన్

చికెన్

చికెన్