విజయనగరం
సోమవారం శ్రీ 7 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025
పేదలకు ప్రభుత్వ విద్యను దూరం చేసే కుట్ర
20 లక్షల మొక్కల పెంపకానికి చర్యలు
కార్మికులకు అండగా.. ఈ శ్రమ్
అసంఘటిత రంగ కార్మికుల పట్ల
విజయనగరం జిల్లా యంత్రాంగం నిర్లక్ష్యధోరణి
అవలంభిస్తోంది.
–8లో
వెయిట్‌లిఫ్టింగ్‌లో
భానుప్రసాద్ ఫస్ట్
బొబ్బిలి: నేపాల్‌కు చెందిన ఎస్‌బీకేఎఫ్ మరి యు ఇందుశ్రీ సంస్థల ఆధ్వర్యంలో అక్కడి పోఖ్రాలో జరిగిన నేషనల్ వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో బొబ్బిలికి చెందిన యువకుడు భానుప్రసాద్ మొదటి స్థానానికి ఎంపికయ్యాడు. ఆదివారం రాత్రి జరిగిన బహుమతుల ప్రధానోత్సవంలో భానుప్రసాద్‌కు జాతీయ స్థాయి ప్రధమ బహుమతిని అక్కడి నిర్వాహకులు ముఖ్య అతిథుల చేతుల మీదుగా అందజేశా రు. ఇటీవలే రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానం సాధించిన భానుప్రసాద్ ఫైనల్స్ జరిగిన నేపాల్‌లో 220 కిలోల విభాగంలో తన సత్తా చాటా డు. భానుప్రసాద్‌ను పలువురు అభినందించారు.
నేరడి సమీపంలో ఏనుగులు
భామిని: మండలంలోని నేరడి బీ సమీపంలో ఏనుగులు ఆదివారం కనిపించాయి. రబీ వరితో పాటు మొక్కజొన్న, కనకాంబరాలు, కూరగాయల పంటలు ధ్వంసం చేస్తున్నాయి. ఏనుగులు పంట చేలల్లో సంచరిస్తుండడంతో తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు ఆందోళన చెందుతున్నారు. మరో వైపు ఏనుగులను చూసేందుకు స్థానికులు ఆసక్తి కనబరుస్తున్నారు.
10న కురుపాంలో జాబ్ మేళా
పార్వతీపురం టౌన్: రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 10వ తేదీన కురుపాం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉపాధి కల్పనలో భాగంగా పదో తరగతి, ఇంటర్, ఐటీఐ, ఏదైనా డిగ్రీ కలిగి 18 ఏళ్లు నిండి 28 ఏళ్లలోపు వయసు గల నిరుద్యోగ యువతీ యువకులు ఈ ఉద్యోగమేళాలో పాల్గొనవచ్చని తెలిపారు. ఆసక్తి గల నిరుద్యోగ యువత ఈ నెల 10వ తేదీ గురువారం ఉదయం 9గంటలకు కురుపాం ప్రభుత్వ జూనియర్ కళాశాలకు హాజరు కావాలని కోరారు. ఈ జాబ్ మేళాలో 12 కంపెనీలకు చెందిన అధికార ప్రతినిధులు హాజరై, అర్హత కలిగిన అభ్యర్థులను వారి కంపెనీలోకి ఎంపిక చేసుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు. జాబ్ మేళాకు హాజరు కానున్న అభ్యర్థులు తమ వివరాలను హెచ్‌టీటీపీఎస్://నైపుణ్యం.ఏపీ.జీఓవీ.ఇన్ వెబ్ సైట్ నందు తప్పనిసరిగా నమోదు చేసుకొని, రిఫరెన్స్ నంబరుతో పాటు బయోడేటా, ఆధార్ కార్డు, విద్యార్హత సర్టిఫికెట్లు ఒరిజినల్, జెరాక్స్, ఒక పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోతో ఉదయం 9గంటలకు డ్రైవ్ జరుగు ప్రదేశంలో హాజరు కావాలని ఆ ప్రకటనలో కోరారు. వివరాలకు 63034 93720, 89788 78557 నంబర్లను సంప్రదించాలని సూచించారు.
తాగునీటి సమస్య ఉండరాదు : కలెక్టర్
పార్వతీపురం టౌన్: వేసవిలో జిల్లాలో ఎక్కడా తాగునీటి సమస్యలు వినిపించరాదని కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఆదివారం సంబంధిత అధికారులతో ఆయన టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందుకు గ్రామీణ నీటి సరఫరా విభాగం ఇంజనీరింగ్ అధికారులు నిత్యం పర్యవేక్షిస్తూ ఉండాలని అన్నారు. సమస్య ఉన్న చోట తక్షణమే స్పందించి, చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే ఆరోగ్య, గ్రామీణ నీటి సరఫరా శాఖలు నీటి నాణ్యత ప్రమాణాల పరీక్షలను ఎప్పటికప్పుడు చేపట్టాలని అన్నారు. చేపట్టే నీటి నాణ్యత పరీక్షలు పక్కాగా ఉండాలని, రెండు శాఖలు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. వేసవి దృష్ట్యా నీటి నాణ్యత ప్రమాణాల పరీక్షలకు సంబంధించి ఆర్‌డబ్ల్యూఎస్ పరిధిలో 14 రకాల పరీక్షలను చేపట్టడం జరుగుతుందని, దీనిని ప్రతీ రోజు పర్యవేక్షణ చేయాలన్నారు. ఇందుకు సంబంధించిన నివేదికలను సమర్పించాలని, అన్ని రకాల పరీక్షలను చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. పరీక్షల విషయమై క్షేత్ర స్థాయిలో అధికారులు అవగాహన కలిగి ఉండాలన్నారు. ఇందుకు ఆయా ప్రాంతాల్లో గల కార్యాలయాలు, సంస్థలు, సంఘాల సహకారం తీసుకోవాలని ఆయన చెప్పారు. వైద్య ఆరోగ్య శాఖ, గ్రామీణ నీటి సరఫరా విభాగం ఇంజనీరింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
జీలకర్ర బెల్లం
చూపిస్తున్న
పురోహితుడు
● రామతీర్థంలో వైభవంగా
శ్రీ సీతారాముల కల్యాణం
● కనులారా వీక్షించి పులకించిన భక్త జనం
● జై శ్రీరామ్ అంటూ మార్మోగిన
రామతీర్థం
● స్వామి వారిని దర్శించుకున్న ప్రజాప్రతినిధులు, ప్రముఖులు
పక్క దారిలో ప్రముఖుల
దర్శనాలు
● ఇబ్బందులు ఎదుర్కొన్న సామాన్య భక్తులు
నెల్లిమర్ల రూరల్: పవిత్ర పుణ్యక్షేత్రం రామతీర్థం శ్రీ సీతారామస్వామి దేవ స్థానంలో రాష్ట్ర ప్రభుత్వ లాంఛనాలతో జరిగిన శ్రీరామనవమి వేడుకల్లో సామాన్య భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వాస్తవానికి సాధారణ భక్తులు ఉత్తర రాజగోపురం మీదుగా గతంలో దర్శనాలు చేసుకునేవారు. తూర్పు రాజగోపురం నుంచి ఇన్‌గేట్ ద్వారా ప్రజాప్రతినిధులు, వీఐపీలు, ఇతర ప్రముఖులు స్వామి దర్శనం చేసుకోవడం ఆనవాయితీ... అయితే ఈ ఏడాది తూర్పు రాజగోపురం వద్ద సామాన్య భక్తులను వేలాదిగా లోపలకి విడిచిపెట్టడంతో ప్రముఖులు వెళ్లాల్సిన లైన్‌లో భారీగా భక్తులు దర్శనమిచ్చారు. దీంతో స్వామి దర్శనానికి విచ్చేసే మంత్రులు, ప్రజాప్రతినిధులను పక్క దారిలో స్వామి దర్శనానికి పంపించారు. వచ్చే భక్తులు, వెళ్లే ప్రజాప్రతినిధులు ఒకే గేట్ ద్వారా రాకపోకలు సాగించడంతో సామాన్య భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఒకేసారి వీఐపీలతో వచ్చే అనుచరులను నేరుగా గర్భగుడిలోకి విడిచి పెట్టడంతో స్వామివారు కనిపించ లేదంటూ పలువురు భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు. సంప్రదాయం ప్రకారం వెనుకమార్గంలో దర్శనాలు చేసుకోవడం శాస్త్ర విరుద్ధమైనప్పటికీ వీవీఐపీలకు సైతం అదే మార్గంలో దర్శనాలు చేయించడంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి.
నెల్లిమర్ల రూరల్:
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన రామతీర్థంలో శ్రీరామనవమి పర్వదినాన శ్రీ సీతారాముల కల్యాణం ఘనంగా జరిగింది. నవమి వేడుకులను పురస్కరించుకొ ని ఆలయంలో వేకువజాము నుంచే ప్రత్యేక పూజ లు ప్రారంభమయ్యాయి. ఉదయం 3 గంటలకు ఆరాధన, బాలభోగం, సేవాకాలం కార్యక్రమాలను అర్చకస్వాములు నిర్వహించారు. 6 గంటలకు యాగశాలలో పూర్ణాహుతి కార్యక్రమం చేపట్టారు. తరువాత ఉత్సవ మూర్తులను ప్రత్యేకంగా అలంకరించిన పల్లకీలో ఉంచి మంగళవాయిద్యాల నడు మ కల్యాణమండపం వద్దకు తీసుకువచ్చారు. మండపంలోని మధ్యభాగంలో అమ్మవారిని, స్వామి వారిని వేంచేంపుజేశారు. మండపంలో ఆశీనులైన శ్రీ సీతారాముల వారికి అర్చకులు ప్రత్యేక పూజలను నిర్వహించారు. శ్రీరామచంద్ర ప్రభువుకు ఏకాంతంగా అవతార సర్గ విన్నపం నిర్వహించారు. అనంతరం శ్రీ సీతారామ లక్ష్మణులకు అత్యంత వైభవంగా పాలు, పెరుగు, నెయ్యి, తేనె, ఫల రసా లు, సముద్ర నదీ జలాలతో అభిషేకాన్ని జరిపించారు. అర్చకస్వాములు ప్రతీ తంతుకు వేదమంత్రాన్ని పఠిస్తూ కల్యాణ ఘట్టాన్ని కొనసాగించారు. కల్యాణ మహోత్సవంలో భాగంగా స్వామివారికి ‘కన్యావరణ’ ‘యజ్నోపవీతదారణం’ జరిపించా రు. వధూవరుల వంశ గోత్ర నామాలను ప్రవచించారు. ఆశీర్వచనం, పాదప్రక్షాళణం, పుష్పోదకస్నా నం నిర్వహించి వరపూజ చేశారు. అనంతరం స్వామివార్లకు నూతన వస్త్రాలంకరణ చేశారు.
అభిజిత్ లగ్నంలో...
వేద పండితులు వేద మంత్రోచ్ఛారణ చేస్తూ సరిగ్గా 12గంటలకు అభిజిత్ లగ్నం సమీపించగానే జీలకర్ర, బెల్లం మిశ్రమాన్ని సీతారామస్వామి వారి శిరస్సుపై ఉంచారు. అనంతరం అర్చకస్వాములు మంత్రాలను జపిస్తూ శాస్త్రోక్తంగా సాక్షాత్తు సీతమ్మ తల్లి మంగళసూత్రాలను భక్త జనులకు చూపించి మాంగల్యధారణ గావించారు. తరువాత తలంబ్రా ల వేడుకను కనుల పండువగా నిర్వహించారు. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి భక్తులు తరలివచ్చారు. వేడుక జరుగుతున్నంతసేపు కల్యాణ ప్రాంగణం రామనామస్మరణతో మార్మోగింది. కల్యాణం అనంతరం స్వామివారి తలంబ్రాలు, తీర్థ ప్రసాదాలను తీసుకొని భక్తులు తిరిగి పయనమయ్యారు. కల్యా ణం జరుగుతున్నంత సేపు సుదర్శన జీవీ హయ గ్రీవాచార్యులు(నంద్యాల) వాస్తవ్యులు ప్రత్యక్ష వ్యాఖ్యాతగా స్వామివారి కల్యాణం గొప్పతనాన్ని భక్తులకు వివరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సంగీత నృత్యాలు, కోలాట కార్యక్రమాలను భక్తులను విశేషంగా అలరించాయి.
రామస్వామిని దర్శించుకున్న ప్రముఖులు
రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సింహాచలం దేవస్థానం నుంచి తెచ్చిన పట్టువస్త్రాలను స్వామివారికి సమర్పించారు. ఆంధ్రప్రదేశ్ శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ, మాజీ ఎంపీ బొత్స ఝాన్సీ దంపతులు కల్యాణ వేడుకకు హాజరై పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు స్వామికి సమర్పించారు. మంత్రి గుమ్మడి సంధ్యారాణి, ఎమ్మెల్సీ డాక్టర్ పెనుమత్స సురేష్ బాబు, ఆలయ ధర్మకర్త పూసపాటి అశోక్‌గజపతిరాజు, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యే అదితి గజపతిరాజు, దేవదాయశాఖ మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణమూర్తి, మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు, ఎస్టీ కమిషన్ రాష్ట్ర అధ్యక్షుడు డీవీజీ శంకరరావు, ఎంపీపీ అంబళ్ల సుధారాణి, వైఎస్సార్‌సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి అంబళ్ల శ్రీరాములనాయుడు, రాష్ట్ర సాధుసంతు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసనంద సరస్వతి, నాయకులు మత్స సత్యనారాయణ, సముద్రపు రామారావు, పతివాడ సత్యనారాయణ, తదితర ప్రముఖులు సీతారామస్వామిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ కీర్తి, ఈఓ శ్రీనివాసరావు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
జైశ్రీరామ్ అని నినదిస్తున్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎంపీ కలిశెట్టి, ప్రజాప్రతినిధులు, అధికారులు, భక్తులు (ఇన్‌సెట్లో) ప్రత్యేక అలంకరణలో సీతారామలక్ష్మణులు
బొబ్బిలి: పేదలకు ప్రభుత్వ విద్యను దూరం చేసే కుట్రను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నాయని యూటీఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు కె.విజయగౌరి విమర్శించారు. స్థానిక ట్రిపుల్ ఎస్ డిగ్రీ కళాశాలలో ప్రభుత్వ పాఠశాలల్లోనే పిల్లలను చేర్పించాలన్న ప్రచార వాల్‌పోస్టర్‌ను ఆమె ఆదివారం ఆవిష్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాల్సిన ప్రభుత్వాలు వాటిని మూసివేసే దిశగా అడుగులు వేస్తుండడం దుర్మార్గమన్నారు. జీవో నంబరు 117తో యూపీ పాఠశాలలు మూసివేసేందుకు సిద్ధపడుతున్నారన్నారు. తక్షణమే ఆ జీవోను రద్దు చేసి, పాఠశాలలను విలీనం చేయవద్దని ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమంలో ఆ సంఘ నాయకులు ప్రసన్నకుమార్ తదితరులు పాల్గొన్నారు.
బొండపల్లి: రాష్ట్ర వ్యాప్తంగా 2025 – 2026 సంవత్సరానికి సంబంధించి 20 లక్షల మొక్కలను వనమిత్ర కేంద్రాలతో పాటు నర్సరీల్లో పెంచేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు అటవీ శాఖ అడిషనల్ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ శాంతిప్రియా పాండే తెలిపారు. మండల కేంద్రంలోని వనమిత్ర కేంద్రాన్ని ఆదివారం ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 33 వనమిత్ర కేంద్రాలతో పాటు నర్సరీల్లో ఈ ఏడాది 20 లక్షల వివిధ రకాలైన మొక్కలను పెంచి పంపిణీ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. అలాగే వివిధ రకాల మొక్కలతో పాటు ప్రత్యేకంగా ఈ ఏడాది 30 వేల పసన మొక్కలను నర్సరీల్లో పెంచి పంపిణీ చేసేందుకుగాను చర్యలు చేపట్టినట్టు తెలిపారు. బొబ్బిలి వీణల తయారీ కోసం అవసరమైన పసన చెట్లు కొరత తీవ్రంగా ఉన్నట్లుగా ప్రభుత్వం దృష్టికి వీణల తయారీదారులు తీసుకువచ్చారని, ఈ నేపథ్యంలో వాటి పెంపకానికి ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. వచ్చే ఏడాది 50 వేల పనస మొక్కలను నర్సరీల్లో పెంచి పంపిణీ చేసేందుకు ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. వనమిత్ర కేంద్రాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపట్టినట్టు తెలిపారు. కార్యక్రమంలో డీఎఫ్‌ఓ కొండలరావు, ఎఫ్‌ఆర్‌ఓ సింధు, ఫారెస్టు ఆఫీసరు బి.అప్పలరాజు వనమిత్ర కేంద్రం సహాయకులు పి.అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు.
న్యూస్‌రీల్
అటవీ శాఖ అడిషనల్ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ శాంతిప్రియా పాండే
విజయనగరం
విజయనగరం
విజయనగరం
విజయనగరం
విజయనగరం
విజయనగరం
విజయనగరం
విజయనగరం
విజయనగరం
విజయనగరం


