భూములు కోల్పోయాం.. న్యాయం చేయండి
● ఎస్టీ కమిషన్ చైర్మన్‌కు గిరిజనులు వినతి
విజయనగరం అర్బన్: ఏకలవ్వ మోడల్ స్కూల్ నిర్మాణంలో భూములు కోల్పోయిన తమకు న్యాయం చేయాలని అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయిలు, దుంబ్రిగుడ మండలాలకు చెందిన గిరిజనులు రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ డీవీజీ శంకరరావుకు విజ్ఞప్తి చేశారు. విజయనగరంలోని ఆయన క్యాంపు కార్యాలయంలో గురువారం కలిసి సమస్యను తెలియజేశారు. తమకు నష్టపరిహారం, ఉపాధి కల్పించడంలో అన్యాయం జరిగిందని పేర్కొన్నారు. భూమికి భూమి ఇచ్చేలా చూడాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. దీనిపై ఆయన స్పందిస్తూ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారమయ్యేలా చూస్తామని తెలిపారు.
జేఎన్‌టీయూ జీవీలో క్రీడా వార్షికోత్సవాలు ప్రారంభం
విజయనగరం అర్బన్: జేఎన్‌టీయూ గురజాడ విజయనగరం (జీవీ)లో రెండు రోజుల పాటు నిర్వహించే ఇంజినీరింగ్ కళాశాల క్రీడా వార్షి కోత్సవాలను ఇన్‌చార్జి వీసీ డి.రాజ్యలక్ష్మి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడారంగంలో విశేష ప్రతిభ కనబర్చిన పార్వతీపురమం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురానికి చెందిన పారా అథ్లెట్ కె.లలిత, వెయిట్ లిఫ్టింగ్ కోచ్ వి.శ్రీనివాసరావును సత్కరించారు. కళాశాల ప్రిన్సిపాల్ ఫ్రొఫెసర్ ఆర్.రాజేశ్వరరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో క్రీడల కోఆర్డినేటర్ డాక్టర్ ఎ.వి.పాపారావు, సాంస్కృతిక అండ్ వార్షికోత్సవ కో ఆర్డినేటర్ డాక్టర్ బి.నళిని సమన్వయ కర్తలుగా వ్యవహరించారు. కార్యక్రమంలో సింబయోసిస్ టెక్నాలజీస్ సీఈఓ ఒ.నరేష్‌కుమార్, యూనివర్సిటీ రిజిస్ట్రార్ జి.జయసుమ, కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ జీజే నాగరాజు పాల్గొన్నారు.
పాలిసెట్‌కు ఉచిత శిక్షణ
విజయనగరం అర్బన్: పాలిటెక్నికల్ కళాశాలల్లో ప్రవేశానికి ఈ నెల 30వ తేదీన నిర్వహించే ప్రవేశ పరీక్షకు ఉచిత శిక్షణ అందజేస్తామని ఏపీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర కార్యదర్శి ఇజ్జురోతు రామునాయుడు, జిల్లా అధ్యక్షుడు కె.శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి వీవీజే సుబ్రహ్మణ్యం గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. కోట కూడలిలోని జియర్ కాంప్లెక్ రెండో అంతస్తులోని సంఘం కార్యాలయంలో శిక్షణ ఇస్తామని పేర్కొన్నారు. శిక్షణ తరగతులు ప్రతిరోజు సాయంత్రం 4.30 నుంచి 7.30 వరకు నిష్టాతులైన ఉపాధ్యాయులతో నిర్వహిస్తామన్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు సెల్: 99083 69568, 82470 83349 నంబర్లను సంప్రదించాలని సూచించారు.
హత్యకేసులో ముద్దాయికి జీవిత ఖైదు
విజయనగరం క్రైమ్: కొత్తవలస పోలీస్‌స్టేషన్ పరిధిలో మూడేళ్ల కిందట నమోదైన హత్య కేసులో ముద్దాయి జోడి నాగరాజుకు విజయనగరం జిల్లా సెషన్స్ జడ్జి కల్యాణ చక్రవర్తి యావజ్జీవ ఖైదు విఽధిస్తూ గురువారం తీర్పు ఇచ్చినట్టు ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు. 2022లో కొత్తవలస మండలం అప్పన్నదొరపాలెం జోడుమెరకకు చెందిన జోడి నాగరాజు తన భార్య లక్ష్మి కనిపించడం లేదని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. అప్పటి కొత్తవలస సీఐ బాలసూర్యారావు కేసు నమోదుచేసి దర్యాప్తు చేయగా, భార్యను పెట్రోల్ పోసి నాగరాజే కాల్చివేసినట్టు నిర్ధారణ అయ్యింది. అతనికి సహకరించిన మౌనికపై అభియోగపత్రాలు నమోదుచేసి కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించారు. నాగరాజు ఒక్కడిపైనే నేరం రుజువు కావడంతో జీవిత ఖైదుతో పాటు రూ.వెయ్యి జరిమానా విఽధిస్తూ తీర్పు వెల్లడించినట్టు ఎస్పీ తెలిపారు. కేసులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ శైలజ వాదనలు వినిపించారు. సాక్షులను కొత్తవలస సీఐ షణ్ముఖరావుతో పాటు ఎస్‌ఐ ఈశ్వరరావు, కోర్టు కానిస్టేబుల్ ఎర్నినాయుడు సకాలంలో ప్రవేశ పెట్టారని ఎస్పీ తెలిపారు.
భూములు కోల్పోయాం.. న్యాయం చేయండి
భూములు కోల్పోయాం.. న్యాయం చేయండి


