విజయనగరం ఫోర్ట్: ఐసీడీఎస్ పరిధిలోని వన్ స్టాప్ సెంటర్ సిబ్బందికి 7 నెలలుగా జీతాలు లేవనే అంశంపై ఈనెల 15వ తేదీన ‘ఐసీడీఎస్‌లో ఆకలి కేకలు’ అనే శీర్షికన ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి ఆ శాఖ అధికారులు స్పందించారు. వన్‌స్టాప్ సిబ్బంది జీతాలకు సంబంధించిన బడ్జెట్ (నిధులు) విడుదలైనట్టు ఐసీడీఎస్ ఇన్‌చార్జి పీడీ జి.ప్రసన్న తెలిపారు.
పెసర, మినుము కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తాం
విజయనగరం ఫోర్ట్: జిల్లాలో పెసర, మినుము కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తామని మార్కెఫెడ్ జిల్లా మేనేజర్ వెంకటేశ్వరావు తెలిపారు. జిల్లాలోని జామి మండలం విజినిగిరి రైతు సేవా కేంద్రం, గంట్యాడ మండలంలోని గంట్యాడ ఆర్‌ఎస్‌కే, బొబ్బిలి, గజపతినగరం, సంతకవిటి మండలాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. నాణ్యత ప్రమాణాలను అనుసరించి పెసలు, మినుములు పూర్తిగా శుభ్రపరిచి కొనుగోలు కేంద్రం వద్దకు తీసుకురావాలన్నారు. పెసలు క్వింటాకు రూ. 8,682, మినుము రూ.7,400 మద్దతు ధరకు కొనుగోలు చేస్తామన్నారు.
హెచ్‌ఎంపై చర్యలు తీసుకోండి
వేపాడ: మండలంలోని కరకవలస పంచాయతీ శివారు మారిక గ్రామ ప్రాథమిక పాఠశాలకు వెళ్లకుండా జీతం తీసుకుంటున్న ప్రధానోపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని ఏపీ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు చల్లా జగన్ డిమాండ్ చేశారు. నెలలో నాలుగురోజులు మాత్రమే పాఠశాలకు వెళ్లి జీతం తీసుకుంటున్నారని, బోధించేవారు లేక మారికలో 28 మంది, పాతమారికలో 14, కొత్తమారికలో 14 మంది పిల్లలు చదువుకు దూరమవుతున్నారన్నారు. హెచ్‌ఎం పనితీరుకు నిరసనగా పాఠశాల వద్ద విద్యార్థులతో కలిసి మంగళవారం ఆందోళన చేశారు. దీనిపై కలెక్టర్ స్పందించాలని కోరారు. కార్యక్రమంలో కె.ఆనంద్, బాబూరావు, అప్పలనాయుడు, రామకృష్ణ, ఆసు, తదితరులు పాల్గొన్నారు.
విచారణ వేగవంతం చేయండి
● శాసనసభ కమిటీ చైర్మన్ నెహ్రూకు పాల రైతు సంఘం నాయకుల వినతి
విజయనగరం ఫోర్ట్: విశాఖ డెయిరీపై విచారణను వేగవంతం చేయాలని పాల రైతుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బుద్ధరాజు రాంబాబు డిమాండ్ చేశారు. కుంచనపల్లిలోని గెస్ట్ హౌస్‌లో శాసనసభ కమిటీ చైర్మన్ జ్యోతుల నోహ్రూను మంగళవారం కలిసి వినతి పత్రం అందజేశారు. తగ్గించిన పాల ధరను పెంచేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. అవినీతికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. వినతిపత్రం అందజేసిన వారిలో పాలరైతు సంఘం కార్యదర్శి కె.అజయ్‌కుమార్, డి సుబ్బారావు, తమటాపు పైడినాయుడు ఉన్నారు.
జీతాల బడ్జెట్ విడుదల
జీతాల బడ్జెట్ విడుదల


