● ఎందుకంత చిన్నచూపు!
పశువైద్య విద్యార్థులపై కూటమి ప్రభుత్వానికి ఎందుకంత చిన్నచూపని గరివిడి వెటర్నరీ వర్సిటీ విద్యార్థులు ప్రశ్నించారు. కళాశాలకు వీసీఐ గుర్తింపును తీసుకురావాలని, స్టైఫండ్‌ను రూ.25వేలకు పెంచాలని కోరుతూ కళాశాల ఆవరణలో 40 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నా స్పందించకపోవడం విచారకరమన్నారు. హోలీ పండగ రోజు అందరి జీవితాలు రంగులమయంగా ఉంటే ఐదు బ్యాచ్‌లకు చెందిన 327 మంది పశువైద్య విద్యార్థుల జీవితాల్లో చీకటి అలముకుందంటూ ప్రధాన గేటు బయట నలుపు వస్త్రాలు ధరించి శుక్రవారం నిరసన తెలిపారు. తమ డిమాండ్లను పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోకుంటే పోరాటాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. – చీపురుపల్లిరూరల్ (గరివిడి)


