విజయనగరం అర్బన్: రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఈ నెల 3, 4 తేదీల్లో జిల్లాలో పర్యటించనున్నారు. వైఎస్సార్ ఆసరా 4వ విడత సంబరాల్లో పాల్గొనడంతో పాటు చీపురుపల్లి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. 3న ఉదయం 10 గంటలకు గరివిడి ఫుట్‌బాల్ మైదానంలో వైఎస్సార్ ఆసరా సంబరాల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం 1.15 గంటలకు గెడ్డపువలసలో రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. మధ్యాహ్నం 4 గంటలకు కొండదాడిలో గ్రామ సచివాలయం, రైతుభరోసా కేంద్రం, వెల్‌నెస్ సెంటర్ భవనాలను ప్రారంభిస్తారు. సాయంత్రానికి విజయనగరంలోని తన నివాసానికి చేరుకుంటారు. 4న ఉదయం 10.30 గంటల నుంచి మెరకముడిదాం మండలం గర్బాంలో జరిగే వైఎస్సార్ ఆసరా సంబరాల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం 2.30 గంటలకు చీపురుపల్లిలో పాలిటెక్నిక్ కళాశాలలో నూతన భవనాలను ప్రారంభిస్తారు. 3.15 గంటలకు పేరిపిలో గ్రామ సచివాలయం, రైతుభరోసా కేంద్రం, వెల్‌నెస్ కేంద్ర భవనాలను ప్రారంభించి, సాయంత్రం 5 గంటలకు విశాఖ మీదుగా రాత్రికి విజయవాడ చేరుకుంటారు.