సీఐఐ సదస్సుకు ఏర్పాట్లు పూర్తి | - | Sakshi
Sakshi News home page

సీఐఐ సదస్సుకు ఏర్పాట్లు పూర్తి

Nov 12 2026 12:25 AM | Updated on Nov 12 2026 12:25 AM

మహారాణిపేట: విశాఖలో 12, 13 తేదీల్లో నిర్వహించనున్న సీఐఐ పారిశ్రామిక భాగస్వామ్య సదస్సుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని జిల్లా ఇన్‌చార్జి మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. బుధవారం ఏయూ ఇంజినీరింగ్‌ కళాశాల మైదానంలోని మీడియా లాంజ్‌లో ఆయన మాట్లాడారు. ఈ రెండు రోజుల సదస్సులో మరో రూ.11 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఎంవోయూలు కుదరనున్నాయని వెల్లడించారు. ఇప్పటికే రూ.20 లక్షల కోట్ల పెట్టుబడుల్లో రూ.17 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టుల పనులు ప్రారంభమయ్యాయని చెప్పారు. తాజా ఒప్పందాలతో మొత్తం పెట్టుబడులు రూ.31 లక్షల కోట్లకు చేరుతాయని, సుమారు 25 లక్షల మంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. సదస్సులో 58 మందికి పైగా విదేశీ ప్రభుత్వ ప్రతినిధులు, దౌత్యవేత్తలు పాల్గొంటారని, 400కు పైగా సమావేశాలు జరగనున్నాయని తెలిపారు. సమావేశంలో ఎంపీ ఎం.శ్రీభరత్‌, ఎమ్మెల్యేలు పి.విష్ణుకుమార్‌రాజు, వంశీకృష్ణ శ్రీనివాస్‌, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement