ఆకట్టుకున్న ఉషశ్రీ నృత్యం | - | Sakshi
Sakshi News home page

ఆకట్టుకున్న ఉషశ్రీ నృత్యం

Nov 12 2026 12:31 AM | Updated on Nov 12 2026 12:31 AM

కంచరపాలెం: వియత్నాంలోని హనోయ్‌ నగరంలో జపనీస్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌ ఆడిటోరియంలో ఇండియన్‌ క్లాసికల్‌ ఇండో–వియత్నాం కల్చరల్‌ ఎక్స్ఛేంజ్‌ ప్రోగ్రామ్‌ వైభవంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా విశాఖకు చెందిన ఉమ్మిడి ఉషశ్రీ ప్రదర్శించిన భరతనాట్య నృత్య రూపకం ప్రేక్షకులను, విశ్వవిద్యాలయ విద్యార్థులను విశేషంగా ఆకట్టుకుంది. భారతీయ సాంప్రదాయ కళా వైభవాన్ని విదేశీ వేదికపై ప్రదర్శించి అందరి ప్రశంసలు అందుకున్న ఉషశ్రీ నృత్య పటిమను జపనీస్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌ యాజమాన్యం, శ్రీ సాయి నటరాజు ఆర్ట్స్‌ ఆకాడమీ డైరెక్టర్‌ డాక్టర్‌ పి.శరత్‌ చంద్ర, ఆర్టిస్ట్‌ ఫ్యాక్టరీ డైరెక్టర్‌ కె.ధరణీధర్‌ ప్రత్యేకంగా కొనియాడారు. ఈ సందర్భంగా ఉషశ్రీని స్కూల్‌ యాజమాన్యం, కార్యక్రమ నిర్వాహకులు ఘనంగా సత్కరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement