జీతాలు అందక.. సెక్యూరిటీ గార్డుల ఆందోళన | - | Sakshi
Sakshi News home page

జీతాలు అందక.. సెక్యూరిటీ గార్డుల ఆందోళన

Nov 12 2026 12:25 AM | Updated on Nov 12 2026 12:25 AM

మహారాణిపేట: గత మూడు నెలల బకాయి జీతాలు తక్షణం చెల్లించాలని కోరుతూ సెక్యూరిటీ గార్డులు నిరసన బాట పట్టారు. ప్రభుత్వ హాస్పిటల్స్‌ కాంట్రాక్ట్‌–ఔట్‌ సోర్సింగ్‌ వర్కర్స్‌ యూనియన్‌(సీఐటీయూ) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బుధవారం ప్రభుత్వ విక్టోరియా ఆస్పత్రి ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి, యూనియన్‌ గౌరవ అధ్యక్షుడు పి.వెంకటరావు మాట్లాడుతూ ఇప్పటికే మూడు నెలలు గడిచిపోయి నాలుగో నెల నడుస్తున్నా.. విక్టోరియా హాస్పిటల్‌ సెక్యూరిటీ గార్డులకు జీతాలు చెల్లించకపోవడం అన్యాయమన్నారు. నెలంతా కష్టపడితే వచ్చే జీతంతో కుటుంబాన్ని పోషించుకునే సెక్యూరిటీ గార్డులకు ఇప్పటివరకు కాంట్రాక్టర్‌ జీతం వేయకపోవడం సరికాదన్నారు. అసోసియేషన్‌ నాయకుడు శ్రీనివాసరావు మాట్లాడుతూ దసరా, దీపావళి పండగలు చేసుకోకుండా తమ కుటుంబాలు ఇబ్బందులు పడ్డాయని, నెలనెలా జీతాలు రాకపోవడం వల్ల అప్పుల పాలవుతున్నామని వాపోయారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెలా జీతాలు చెల్లించేటట్లు చర్యలు తీసుకోవాలని, కనీస వేతనం రూ.26 వేలకు పెంచాలని డిమాండ్‌ చేశారు. బుధవారం ఉదయం 7 గంటలకు విధులు బహిష్కరించి ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. అసోసియేషన్‌ నాయకులు ఎస్‌.ఎల్లారావు, బి.ధనలక్ష్మి, డి.దీపిక, ఎ.శంకరరావు, ఆకుల మహేష్‌ నాయకత్వంలో విక్టోరియా ఆస్పత్రి సెక్యూరిటీ గార్డులందరూ పాల్గొని బకాయి జీతాలు చెల్లించాలని నినాదాలు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement