రేపటి నుంచి నరెడ్కో వైజాగ్‌ ప్రాపర్టీ ఎక్స్‌పో | - | Sakshi
Sakshi News home page

రేపటి నుంచి నరెడ్కో వైజాగ్‌ ప్రాపర్టీ ఎక్స్‌పో

Nov 12 2026 12:25 AM | Updated on Nov 12 2026 12:25 AM

బీచ్‌రోడ్డు: నగరంలో స్థిరాస్తి రంగ అభివృద్ధికి ఊతమిచ్చేలా నరెడ్కో ఆధ్వర్యంలో వైజాగ్‌ ప్రాపర్టీ ఎక్స్‌పో–2026 నిర్వహించనున్నట్లు నరెడ్కో రాష్ట్ర అధ్యక్షుడు గడ్డే చక్రధర్‌ వెల్లడించారు. నవంబర్‌ 13, 14, 15 తేదీల్లో ఈ ఎక్స్‌పో జరగనుందన్నారు. నగరంలో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఎక్స్‌పో వివరాలు వెల్లడించారు. ఎంవీపీ కాలనీలోని గాదిరాజు ప్యాలెస్‌ వేదికగా ఎస్‌బీఐ సహకారంలో జరిగే ఈ ప్రాపర్టీ ఎక్స్‌పోను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌ నాయుడు, శాసనసభ స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. విశాఖ నగరం వేగంగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో స్థిరాస్తి రంగానికి డిమాండ్‌ పెరుగుతోందన్నారు. ఈ నేపథ్యంలో సామాన్య, మధ్యతరగతి ప్రజలకు అందుబాటు ధరల్లో గృహాలు, ప్లాట్లు, విల్లాల వివరాలను ఒకే వేదికపై అందించడమే ఎక్స్‌పో ప్రధాన ఉద్దేశమని వివరించారు. గృహ కొనుగోలుదారులకు అవసరమైన బ్యాంకు రుణ సదుపాయాలతో పాటు గృహ నిర్మాణ సామగ్రి, ఇంటీరియర్‌ డిజైనింగ్‌కు సంబంధించిన స్టాళ్లు కూడా ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా నరెడ్కో ప్రతినిధులు ఎక్స్‌పో బ్రోచర్‌ ఆవిష్కరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement