ఘనంగా యూనియన్‌ బ్యాంక్‌ వ్యవస్థాపక దినోత్సవం | - | Sakshi
Sakshi News home page

ఘనంగా యూనియన్‌ బ్యాంక్‌ వ్యవస్థాపక దినోత్సవం

Nov 12 2026 12:25 AM | Updated on Nov 12 2026 12:25 AM

ఎంవీపీ కాలనీ: యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా 108వ వ్యవస్థాపక దినోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. ఎంవీపీ కాలనీలోని గాదిరాజు ప్యాలెస్‌ వేదికగా జరిగిన వేడుకల్లో బ్యాంకు జోనల్‌ హెడ్‌ సోనాలికా, డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ ఎస్‌.జయరాజు, విశాఖ ప్రాంతీయాధికారి జె.సింహాచలం అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 108 ఏళ్ల యువ ప్రస్థానం– ఉజ్వల భవిష్యత్‌ కోసం సమష్టి ముందడుగు నినాదంతో బ్యాకింగ్‌ సేవల్లో విశ్వాసం, అత్యుత్తమ ప్రమాణాలు, నూతన ఆవిష్కరణల దిశగా యూనియన్‌ బ్యాంకు సేవలు అందిస్తోందన్నారు. ఉద్యోగులంతా మరింత నిబద్ధతతో ఖాతాదారులకు విలువైన సేవలు అందించి నిరంతర విశ్వాసం పొందాలని సూచించారు. ఈ సందర్భంగా దేశ సరిహద్దులను నిరంతరం కాపాడుతున్న భారత సైనికులకు మద్దతుగా జాతీయ రక్షణ నిధికి యూనియన్‌ బ్యాంకు ఉద్యోగులు రూ.11.17 కోట్లు విరాళంగా అందజేయడంతో పాటు దేశవ్యాప్తంగా 108 కొత్త శాఖలను ప్రారంభించినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో పలువురు బ్యాంకు ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement