పకడ్బందీగా సమ్మిట్‌ ఏర్పాట్లు | - | Sakshi
Sakshi News home page

పకడ్బందీగా సమ్మిట్‌ ఏర్పాట్లు

Nov 11 2026 3:51 AM | Updated on Nov 11 2026 3:51 AM

● అధికారులకు కలెక్టర్‌ అభిషిక్త్‌ కిశోర్‌ ఆదేశం ● ఏయూ మైదానంలో ఏర్పాట్ల పరిశీలన

మహారాణిపేట: సీఐఐ పార్టనర్‌షిప్‌ సమ్మిట్‌ ఈ నెల 12, 13 తేదీల్లో ఏయూ ఇంజినీరింగ్‌ కళాశాల మైదానంలో జరగనున్న నేపథ్యంలో ఏర్పాట్లన్నీ పకడ్బందీగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ ఎం.అభిషిక్త్‌ కిశోర్‌ అధికారులను ఆదేశించారు. జీవీఎంసీ కమిషనర్‌ కేతన్‌ గార్గ్‌, ఇతర సంబంధిత అధికారులు, సీఐఐ ప్రతినిధులతో కలిసి మంగళవారం సమ్మిట్‌ వేదిక వద్ద జరుగుతున్న ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా మౌలిక సదుపాయాలు, అతిథులకు కల్పించాల్సిన వసతులు, రవాణా, పార్కింగ్‌, భద్రత, పారిశుధ్య ఏర్పాట్లను సమీక్షించారు. వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ నిర్దేశిత గడువులోగా పనులన్నీ పూర్తి చేయాలని సూచించారు. అనంతరం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్‌ హాల్‌, సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ను కలెక్టర్‌ సందర్శించారు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు ముందస్తు కార్యాచరణతో సిద్ధంగా ఉండాలని ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement