నేరగాళ్లకు అనుకూలంగా.. | - | Sakshi
Sakshi News home page

నేరగాళ్లకు అనుకూలంగా..

Nov 11 2026 3:51 AM | Updated on Nov 11 2026 3:51 AM

నగరంలో జనాభా పెరుగుదలతో పాటు నేరాల నియంత్రణ కూడా పోలీసులకు సవాల్‌గా మారుతోంది. ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచి ఉపాధి కోసం వస్తున్న వారిలో కొందరు నేరాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. స్థానిక నేరగాళ్లతో కలిసి దొంగతనాలు, దోపిడీలు తదితర ఘటనలకు పాల్పడుతున్నట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ తరహా ఘటనల్లో నిందితులను గుర్తించేందుకు సీసీ కెమెరాల ఫుటేజీ కీలక ఆధారంగా మారుతుంది. కెమెరాలు పనిచేసే ప్రాంతాల్లో నేరాలకు సంబంధించిన ఆనవాళ్లు లభించే అవకాశం ఉండగా, అవి లేని ప్రాంతాల్లో దర్యాప్తునకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇటీవల చోటుచేసుకుంటున్న కొన్ని దోపిడీలు, దొంగతనాలు, హత్యల కేసుల్లో ఆధారాల సేకరణకు నిఘా కెమెరాల నిర్వహణ లోపాలు ఆటంకంగా మారుతున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement