మహారాణిపేట: రాష్ట్రంలో రేషన్ డీలర్లకు ఇస్తున్న కమీషన్ సరిపోవట్లేదని, దీన్ని ఇంకా పెంచాలని రాష్ట్ర రేషన్ డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు దివి లీలామాధవరావు కోరారు. మంగళవారం విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడారు. క్రెడిట్ ఆర్వోతో సరకులు ఇవ్వాలని, నిర్వహణ ఖర్చులు పెరిగాయని పల్లెల్లో రేషన్ షాప్ సహాయకులకు రూ.5 వేలు, పట్టణంలో రూ.7,500 ఇవ్వాలని కోరుతున్నామన్నారు. డీలర్లకు క్వింటాల్‌కు రూ.200 కమీషన్ ఇవ్వాలన్నారు. వికలాంగులకు, వృద్ధులకు క్యూఆర్ కోడ్ విధానం కొద్ది రోజులు నిలుపు చేయాలని ఇండియన్ రేషన్ డీలర్స్ అసోసియేషన్ కార్యదర్శి బిస్వంబర్ బసు కోరారు. రేషన్ షాప్ డీలర్స్ సమస్యలపై ఢిల్లీలో పోరాటం చేయనున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే రేషన్ డీలర్లు సమస్యలను బీజేపీ ఇతర పార్టీల ఏంపీలకు నివేదించామన్నారు.


