కెమెరాలున్నా.. కనిపించని భద్రత! | - | Sakshi
Sakshi News home page

కెమెరాలున్నా.. కనిపించని భద్రత!

Nov 11 2026 3:51 AM | Updated on Nov 11 2026 3:51 AM

విశాఖలో నిద్రావస్థలో నిఘా నేత్రాలు!

747 సీసీ కెమెరాలు నిరుపయోగం

కూటమి పాలనలో నగర భద్రతపై నిర్లక్ష్యం

నిర్వహణ ఒప్పందాలు ముగిసినా ప్రత్యామ్నాయ చర్యలు శూన్యం

విశాఖ నగరంలో ప్రజల ప్రాణ, ఆస్తుల రక్షణకు కీలకమైన సీసీ కెమెరాల నిఘా వ్యవస్థ నిర్వహణ లోపాలతో నీరుగారుతోంది. నగరంలోని ప్రధాన కూడళ్లు, సమస్యాత్మక ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన నిఘా నేత్రాలు పనిచేయకపోవడంతో భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది. నేరాల నియంత్రణ, నిందితుల గుర్తింపు, రహదారి ప్రమాదాల దర్యాప్తులో కీలకంగా ఉపయోగపడాల్సిన కెమెరాలు నిద్రావస్థలోకి జారుకున్నాయి. ఫలితంగా విశాఖకు నిత్యం విచ్చేసే దేశ, విదేశీ ప్రతినిధులు, ప్రముఖులు, పర్యాటకుల భద్రతపైనా ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ద్వారకానగర్‌: కోట్లాది రూపాయల ప్రజాధనంతో నగరంలో ఏర్పాటు చేసిన నిఘా వ్యవస్థ నిర్వహణ విషయంలో పోలీసు శాఖ, జీవీఎంసీ అధికారుల మధ్య సమన్వయం కొరవడిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. విశాఖ నగర భద్రత కోసం వివిధ ప్రభుత్వ ప్రాజెక్టుల కింద సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఏపీ క్లౌడ్‌ ఆధారిత ఐపీ సీసీటీవీ ప్రాజెక్టులో 1,620 కెమెరాలు, జీవీఎంసీ స్మార్ట్‌ సిటీ ప్రాజెక్టులో 592, జీ–20 సదస్సు సందర్భంగా మరో 155 కెమెరాలను ఏర్పాటు చేశారు. అయితే మొత్తం 2,367 కెమెరాల్లో 747 పనిచేయడం లేదనే గణాంకాలు నిఘా వ్యవస్థ నిర్వహణ తీరును ప్రశ్నార్థకం చేస్తున్నాయి. ఏఎంసీ(వార్షిక నిర్వహణ ఒప్పందం) గడువు ముగియడంతో వందలాది కెమెరాలు నిరుపయోగంగా మారినట్లు తెలుస్తోంది. నిర్వహణ ఒప్పందం ముగుస్తుందని ముందే తెలిసినా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఎందుకు చేయలేదన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రాజెక్టులు ఏర్పాటు చేయడం, నిర్వహణ సంస్థలకు అప్పగించడంతోనే ప్రభుత్వ బాధ్యత ముగిసిపోతుందా? ప్రజాధనంతో నిర్మించిన వ్యవస్థను నిరుపయోగంగా వదిలేయడానికి బాధ్యు

మరమ్మతులకు అరకొర నిధులేనా?

జీవీఎంసీ పరిధిలోని నిఘా కెమెరాల నిర్వహణ బాధ్యతల విషయంలోనూ స్పష్టత కొరవడిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. కొన్ని నిర్వహణ పనులను ప్రైవేటు సంస్థలకు అప్పగించినప్పటికీ, అవసరమైన స్థాయిలో నిధులు కేటాయించకపోవడంతో మరమ్మతులు పూర్తిస్థాయిలో జరగడం లేదనే ఆరోపణలున్నాయి. రోడ్లు, గోడలకు రంగులు వేయడం, ఇతర సుందరీకరణ పనులపై చూపుతున్న శ్రద్ధ నిఘా వ్యవస్థ నిర్వహణపై కనిపించడం లేదని నగరవాసులు ఆరోపిస్తున్నారు. ప్రజల భద్రతకు అత్యంత కీలకమైన కెమెరాల పనితీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షించాల్సిన అవసరం ఉంది. పోలీసు శాఖ, జీవీఎంసీ అధికారులు పరస్పర సమన్వయంతో పని చేయని కెమెరాలను గుర్తించి మరమ్మతులు చేయించాలి. కొత్త నిర్వహణ ఒప్పందాలు కుదుర్చుకుని నిఘా వ్యవస్థను నిరంతరం అందుబాటులో ఉంచాలని నగరవాసులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement