మల్కాపురం: నీట్ పీజీ–2026 ఫలితాల్లో పారిశ్రామిక ప్రాంతానికి చెందిన చెక్కా నాగరత్న అమృత ఆలిండియా 415వ ర్యాంక్ సాధించారు. నౌసేనాబాగ్ కేవీ పాఠశాలలో పాఠశాల విద్యను పూర్తి చేసిన అమృత.. ఇంటర్ విద్యను చైతన్యలో అభ్యసించారు. అనంతరం ఆంధ్ర మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ పూర్తి చేశారు. నీట్ పీజీలో జాతీయ స్థాయిలో మంచి ర్యాంక్ సాధించడంతో ఆమెను పలువురు అభినందించారు. అమృత తండ్రి రామకృష్ణ విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో, తల్లి కె. ఆదిలక్ష్మి హెచ్‌పీసీఎల్‌లో విధులు నిర్వహిస్తున్నారు. వీరికి ఏకై క సంతానమైన అమృత.. చిన్ననాటి నుంచే చదువుల్లో ప్రతిభ కనబరుస్తూ వచ్చారు. నీట్ పీజీలో సాధించిన ర్యాంక్‌తో రేడియో డయాగ్నోసిస్ విభాగంలో ఉన్నత చదువులు కొనసాగించాలనే లక్ష్యం ఉందని అమృత తెలిపారు. చదువులోనే కాకుండా సంగీతంలోనూ ప్రతిభ కనబరిచే ఆమె మంచి గాయనిగా గుర్తింపు పొందారు.


