జాతీయ శిక్షణలో శ్రీనివాసరావుకు అవార్డు | - | Sakshi
Sakshi News home page

జాతీయ శిక్షణలో శ్రీనివాసరావుకు అవార్డు

Sep 26 2026 12:44 AM | Updated on Sep 26 2026 12:44 AM

మహారాణిపేట: న్యూఢిల్లీలో సెప్టెంబర్‌ 21–23 వరకు జరిగిన జాతీయ స్థాయి శిక్షణ కార్యక్రమంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన జిల్లా డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎం.శ్రీనివాసరావుకు అవార్డు లభించింది. 15 రాష్ట్రాలు, 10 కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు చెందిన 40 మంది అధికారులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో కేంద్ర ఔషధ నియంత్రణ సంస్థ జాయింట్‌ డ్రగ్‌ కంట్రోలర్‌ డాక్టర్‌ ఎస్‌.ఈశ్వరరెడ్డి అవార్డును అందజేశారు. శుక్రవారం విశాఖలో ఔషధ నియంత్రణ శాఖ డైరెక్టర్‌ జనరల్‌ పి.అరుణ్‌బాబును మర్యాదపూర్వకంగా కలిసిన శ్రీనివాసరావును ఆయన అభినందించారు. అనంతరం కెమిస్ట్‌ వెల్ఫేర్‌ సొసైటీ, కెమిస్ట్‌ అండ్‌ డ్రగ్గిస్ట్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో శ్రీనివాసరావును సత్కరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement