వానొస్తే కేజీహెచ్‌ వణుకే.. | - | Sakshi
Sakshi News home page

వానొస్తే కేజీహెచ్‌ వణుకే..

Sep 26 2026 12:44 AM | Updated on Sep 26 2026 12:44 AM

మహారాణిపేట: కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు కేజీహెచ్‌లో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. క్యాజువాలిటీ ఓపీ బ్లాక్‌, డైట్‌ క్యాంటిన్‌లలోకి వర్షపు నీరు చేరింది. ఓపీ బ్లాక్‌లో సీలింగ్‌ పెచ్చులు ఊడిపడి కిందకు పడడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. పడిపోయిన సీలింగ్‌ను డాక్టర్‌ గోపాలరావు పరిశీలించారు.డైట్‌ క్యాంటిన్‌లోనూ సీలింగ్‌ ఊడిపడింది. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ఇదే సమయంలో ఎయిర్‌ కండిషనర్‌ మిషన్‌లో మంటలు చెలరేగడంతో సిబ్బంది ఆందోళనకు గురయ్యారు. వెంటనే విద్యుత్‌ సరఫరా నిలిపివేయడంతో ప్రమాదం తప్పింది.గైనిక్‌, పిల్లల వార్డులతో పాటు రాజేంద్రప్రసాద్‌, భావనగర్‌ వార్డుల్లోకి కూడా వర్షపు నీరు చేరడంతో రోగులు, వారి బంధువులు ఇబ్బందులు పడ్డారు. ఆయుర్వేద ఓపీలో శుక్రవారం కూడా నీరు నిలిచింది. ఓపీ సేవలకు వచ్చే రోగులు, సహాయకులు అవస్థలు ఎదుర్కొన్నారు.పలు వార్డుల్లో గోడల నుంచి నీరు కారడం, మరుగుదొడ్ల వద్ద నీరు నిలిచిపోవడం, కుర్చీలు తడవడం కనిపించింది. కొన్ని చోట్ల విద్యుత్‌ వైర్లు, మీటర్లపైకి నీరు చేరుతుండటంతో రోగులు, సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement