విశాఖపట్నం: తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో గ్రేటర్ విశాఖకు చెందిన మాజీ ప్రజాప్రతినిధులు, సీనియర్ నేతలు, నాయకులు, కార్యకర్తలతో మాజీ ముఖ్యమంత్రి, పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం సమావేశం నిర్వహించారు. పలు అంశాలపై పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. సమావేశంలో శాసనసమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, పార్టీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు, రీజనల్ కో–ఆర్డినేటర్లు కురసాల కన్నబాబు, గుడివాడ అమర్‌నాథ్, పీఏసీ సభ్యులు గొల్ల బాబూరావు, తిప్పల నాగిరెడ్డి, కరణం ధర్మశ్రీ, విశాఖ పార్లమెంట్ పరిశీలకులు కదిరి బాబూరావు, అనకాపల్లి జిల్లా పార్టీ అధ్యక్షుడు బొడ్డేటి ప్రసాద్, నియోజకవర్గ సమన్వయకర్తలు వాసుపల్లి గణేష్‌కుమార్, మళ్ల విజయప్రసాద్, అన్నంరెడ్డి అదీప్‌రాజ్, తిప్పల దేవన్‌రెడ్డి, మొల్లి అప్పారావు, బొత్స అనూష, ఎమ్మెల్సీలు వరుదు కల్యాణి, కుంభ రవిబాబు, నియోజకవర్గ పరిశీలకులు పసుపులేటి బాలరాజు, తైనాల విజయ్‌కుమార్, చింతలపూడి వెంకటరామయ్య, కోలా గురువులు, చింతకాయల సన్యాసిపాత్రుడు, రొంగలి జగన్నాథం, సతీష్‌వర్మ, వీసం రామకృష్ణ, జహీర్ అహ్మద్, బాణాల శ్రీనివాసరావు, చిక్కాల రామారావు, సీఈసీ, ఎస్‌ఈసీ సభ్యులు, రాష్ట్ర, జిల్లా పార్టీ కమిటీ సభ్యులు, మాజీ కార్పొరేట్లు, వార్డు అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.


