వైభవంగా వైశాఖీ నృత్యోత్సవాలు | - | Sakshi
Sakshi News home page

వైభవంగా వైశాఖీ నృత్యోత్సవాలు

Sep 27 2026 1:34 AM | Updated on Sep 27 2026 1:34 AM

మద్దిలపాలెం: నటరాజ్‌ మ్యూజిక్‌ అండ్‌ డ్యాన్స్‌ అకాడెమీ ఆధ్వర్యంలో ‘వైశాఖీ నృత్యోత్సవ్‌–2026’ అఖిల భారత జాతీయ నృత్యోత్సవాలు శనివారం కళాభారతి ఆడిటోరియంలో ప్రారంభమయ్యాయి. సంస్థ వ్యవస్థాపకుడు బీఆర్‌ విక్రమ్‌ కుమార్‌(గౌడ్‌) ఉత్సవ సంచాలకులుగా వ్యవహరిస్తున్నారు. తొలిరోజు మహారాష్ట్రకు చెందిన పద్మశ్రీ దర్శనా ఝవేరి బృందం మణిపురి నృత్యం, కర్ణాటకకు చెందిన హరి రెడ్డి బృందం కథక్‌, ఒడిశాకు చెందిన ధను బిసాయ్‌ బృందం యానిమల్‌ మాస్క్‌ డ్యాన్స్‌ ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా దర్శనా ఝవేరికి ‘వైశాఖీ భారత నృత్య భూషణ–2026’ పురస్కారం, హరి రెడ్డికి వైశాఖీ జాతీయ పురస్కారం అందజేశారు. అనంతరం నగరానికి చెందిన పలు నృత్య బృందాలు కూచిపూడి, భరతనాట్యం ప్రదర్శనలు నిర్వహించాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అడిషనల్‌ కమిషనర్‌ సీజీఎస్టీ ఎన్‌. మహ్మద్‌ అలీ, విశిష్ట అతిథిగా అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి ఉషశ్రీ, గౌరవ అతిథిగా రైటర్స్‌ అకాడమీ చైర్మన్‌ వీవీ రమణమూర్తి హాజరయ్యారు. పలువురు ప్రముఖులు, నిర్వాహకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement