వినాయక నిమజ్జనంలో విషాదం | - | Sakshi
Sakshi News home page

వినాయక నిమజ్జనంలో విషాదం

Sep 27 2026 1:34 AM | Updated on Sep 27 2026 1:34 AM

డీజే మోతకు మరో ప్రాణం బలి

గోపాలపట్నం: జీవీఎంసీ 52వ వార్డు అంబేడ్కర్‌నగర్‌లో శనివారం రాత్రి వినాయక నిమజ్జనం ఊరేగింపులో విషాదం చోటుచేసుకుంది. డీజే మోత మధ్య ఉత్సాహంగా డ్యాన్స్‌ చేస్తున్న ఓ వ్యక్తి ఒక్కసారిగా కుప్పకూలి మృతి చెందాడు. ఎయిర్‌పోర్టు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎన్‌ఏడీ ప్రాంతంలో చిన్నచిన్న పనులు చేసుకుంటూ జీవించే ఆ వ్యక్తి ఊరేగింపులో డ్యాన్స్‌ చేస్తుండగా కళ్లు తిరిగి పడిపోయాడు. 108 సిబ్బంది పరిశీలించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. స్థానికులు ఇతడిని ఆర్‌ అండ్‌ బీ అని పిలుస్తుంటారు. పోలీసులు మృతదేహాన్ని కేజీహెచ్‌కు తరలించారు. డీజే భారీ శబ్దం, వైబ్రేషన్ల కారణంగానే అతడు మృతి చెందాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. అయితే మృతికి అసలు కారణం పోస్టుమార్టం నివేదికలో తేలాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement