జీవీఎంసీ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు | - | Sakshi
Sakshi News home page

జీవీఎంసీ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు

Sep 27 2026 1:34 AM | Updated on Sep 27 2026 1:34 AM

అల్లిపురం: జీవీఎంసీ ఎన్నికలను పారదర్శకంగా, సజావుగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జీవీఎంసీ కమిషనర్‌, అదనపు ఎన్నికల అథారిటీ కేతన్‌ గార్గ్‌ అధికారులను ఆదేశించారు. శనివారం అధికారులు, జోనల్‌ కమిషనర్లతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించి ఎన్నికల సన్నద్ధతపై సూచనలు చేశారు. అనంతరం డాక్టర్‌ లంకపల్లి బుల్లయ్య కళాశాలలో రిటర్నింగ్‌ అధికారులు, సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. పోలింగ్‌ కేంద్రాల గుర్తింపు, ఓటర్ల జాబితాల పరిశీలన, ఫొటో ఓటర్ల జాబితాల తయారీ, మౌలిక సదుపాయాల కల్పనపై అవగాహన కల్పించారు. ప్రతి పోలింగ్‌ కేంద్రంలో తాగునీరు, విద్యుత్‌, మరుగుదొడ్లు, దివ్యాంగులకు ర్యాంపులు ఉండేలా చూడాలని సూచించారు. ఎన్నికల ఏర్పాట్లను నిరంతరం పర్యవేక్షించాలని జోనల్‌ కమిషనర్లను ఆదేశించారు.

వార్డుల వారి వివరాలు కమిషనర్‌కు వివరిస్తున్న అధికారులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement