విశాఖలో గంటల కొద్దీ పవర్‌ కట్‌! | - | Sakshi
Sakshi News home page

విశాఖలో గంటల కొద్దీ పవర్‌ కట్‌!

Sep 22 2026 1:12 AM | Updated on Sep 22 2026 1:12 AM

● విద్యార్థిని వీడియో వైరల్‌ ● సమస్యపై తీవ్ర ఆవేదన

మహారాణిపేట: మహా విశాఖ నగరంలో నీటి సమస్యతో పాటు గంటల తరబడి విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడంపై సోనాలి సాహా అనే విద్యార్థిని చేసిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. చదువుకునే కీలక సమయాల్లో విద్యుత్‌ లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. గంటల తరబడి విద్యుత్‌ కోతలు విధిస్తే విద్యార్థుల భవిష్యత్తు ఏమవుతుందని ఆమె వీడియోలో ప్రశ్నించారు. నగరంలో విద్యుత్‌ సరఫరాకు అంతరాయానికి కారణమేంటి? గంటల తరబడి విద్యుత్‌ కోతలు ఎందుకు కొనసాగుతున్నాయి? అనే అంశాలపై ఈపీడీసీఎల్‌ అధికారులు తక్షణమే స్పష్టత ఇవ్వాలని ఆమె వీడియోకు నెటిజన్లు, విద్యార్థుల తల్లిదండ్రులు మెసేజ్‌ల ద్వారా డిమాండ్‌ చేస్తున్నారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి చర్యలు చేపట్టి విద్యుత్‌ కోతలను నివారించాలని కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement