పెందుర్తి: మరణించిన ఓ వ్యక్తి నేత్రాలను దానం చేసి అతని కుటుంబ సభ్యులు పెద్ద మనసు చాటుకున్నారు. పెందుర్తిలో నివాసం ఉంటున్న జీవీఎంసీ ఉద్యోగి చిక్కాల వరాహనరసింహం(50) సోమవారం ఉదయం అనారోగ్యంతో మరణించారు. సమాచారం అందుకున్న సాయి హెల్పింగ్ హ్యాండ్స్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు దాడి శ్రీనివాస్ నేత్రదానం గురించి కుటుంబ సభ్యులను సంప్రదించారు. మృతుని భార్య పార్వతి వెంటనే అంగీకారం తెలిపారు. ఎల్వీ ప్రసాద్ మొహిషిన్ నేత్రనిధి ప్రతినిధులు మనోజ్, లక్ష్మి వచ్చి, మృతదేహం నుంచి నేత్రాలు సేకరించారు.


