వ్యర్థాల శాసీ్త్రయ నిర్వహణకు చర్యలు | - | Sakshi
Sakshi News home page

వ్యర్థాల శాసీ్త్రయ నిర్వహణకు చర్యలు

Sep 20 2026 1:33 AM | Updated on Sep 20 2026 1:33 AM

మంత్రి నారాయణ

మధురవాడ: నగరంలో ఉత్పత్తయ్యే వ్యర్థాలను శాసీ్త్రయంగా నిర్వహించి, ఉపయోగకరమైన వనరులుగా మార్చేందుకు కాపులుప్పాడ డంపింగ్‌ యార్డులో ఏర్పాటు చేసిన ప్లాంట్లను సమర్థంగా వినియోగించాలని మంత్రి పి.నారాయణ అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ సునీల్‌కుమార్‌రెడ్డి, జీవీఎంసీ కమిషనర్‌ కేతన్‌గార్గ్‌ తదితర అధికారులతో కలిసి డంపింగ్‌ యార్డులోని బయోగ్యాస్‌, సీ అండ్‌ డీ వ్యర్థాల నిర్వహణ ప్లాంట్లను పరిశీలించారు. నగరంలో ఉత్పత్తయ్యే వ్యర్థాలను ప్లాంట్లకు తరలించి రీసైక్లింగ్‌ చేస్తే మెరుగైన ఫలితాలు సాధించవచ్చన్నారు. ప్లాంట్ల సమర్థ నిర్వహణకు అవసరమైన స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రొసీజర్స్‌ రూపొందించాలని ఆదేశించారు. భవన నిర్మాణ, కూల్చివేత వ్యర్థాలను రోడ్ల పక్కన, కాలువలు, ఖాళీ ప్రదేశాల్లో పారవేయకుండా డంపింగ్‌ యార్డుకు తరలించేలా పటిష్ట చర్యలు చేపట్టాలని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఎస్‌.సురేష్‌కుమార్‌ ఆదేశించారు. మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ కమిషనర్‌ అండ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ పి.సంపత్‌కుమార్‌, ఇతర అధికారులతో కలిసి ఆయన సీ అండ్‌ డీ వేస్ట్‌ ప్లాంట్‌ను సందర్శించారు. కార్యక్రమంలో అదనపు కమిషనర్‌ నల్లనయ్య, జెడ్సీ అయ్యప్పనాయుడు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement