బీచ్‌రోడ్డు: పల్సర్ బ్రాండ్ 25 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకోవడంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా రెండు కోట్లకు పైగా వాహనాల విక్రయాల సందర్భంగా సిరిపురంలోని వరుణ్ బజాజ్ షోరూంలో సరికొత్త పల్సర్ శ్రేణిని సోమవారం ఆవిష్కరించారు. స్పోర్టీ స్వభావాన్ని కొనసాగిస్తూ ఆధునిక డిజైన్, మెరుగైన పనితీరు, అధునాతన సాంకేతిక ఫీచర్లతో కొత్త పల్సర్ 150ను తీర్చిదిద్దారు. బోల్డ్, మస్క్యులర్ డిజైన్, వోల్ఫ్–ఐ ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్, క్రిస్టల్ టెయిల్ ల్యాంప్స్, స్పోర్టీ పెంటగాన్ సైలెన్సర్ దీని ప్రత్యేక ఆకర్షణ. 14 పీఎస్ శక్తినిచ్చే సరికొత్త ఇంజిన్, తక్కువ ఆర్‌పీఎంలో అధిక టార్క్, 150 సీసీ విభాగంలో తొలిసారిగా క్రాల్ టెక్, స్పోర్ట్, రోడ్, రైన్ రైడ్ మోడ్లు, ఐడిల్ స్టార్ట్/స్టాప్, ఆయిల్–కూల్డ్ ఇంజిన్ వంటి ఫీచర్లు అందించారు. 5 అంగుళాల టీఎఫ్‌టీ డిస్‌ప్లే, గూగుల్ మ్యాప్స్ మిర్రరింగ్, యూఎస్‌బీ–సీ చార్జింగ్, ట్విన్ డిస్క్ బ్రేకులు తదితర సదుపాయాలున్నాయి. తక్కువ డౌన్‌పేమెంట్‌తో వాహనం అందుబాటులో ఉంటుందని, బుకింగ్స్‌కు మంచి స్పందన లభిస్తోందని షోరూం సిబ్బంది తెలిపారు. కార్యక్రమంలో ఎస్‌ఎం అబ్బాస్ శేఖరన్, వరుణ్ బజాజ్ సీఈవో శ్రీనివాస్, వరుణ్ సిబ్బంది పాల్గొన్నారు.


