అర్జీలకు తక్షణ పరిష్కారం | - | Sakshi
Sakshi News home page

అర్జీలకు తక్షణ పరిష్కారం

Sep 8 2026 12:17 AM | Updated on Sep 8 2026 12:17 AM

మహారాణిపేట: ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు చురుగ్గా వ్యవహరించి, నిర్ణీత సమయంలో నాణ్యమైన పరిష్కారం చూపాలని కలెక్టర్‌ ఎం. అభిషిక్త్‌ కిశోర్‌ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజల నుంచి వినతులు స్వీకరించిన ఆయన, ప్రతి ఫిర్యాదును క్షుణ్ణంగా పరిశీలించి చర్యలు తీసుకోవాలని సూచించారు.ఈ సందర్భంగా పీజీఆర్‌ఎస్‌లో మొత్తం 318 వినతులు అందాయి. కార్యక్రమంలో జేసీ విద్యాధరి, డీఆర్వో ఎం. విశ్వేశ్వరనాయుడు, ఆర్డీవో సంగీత్‌ మాధుర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement