గుంతల పూడ్చివేతకు ‘కొత్త డాక్టర్‌’ | - | Sakshi
Sakshi News home page

గుంతల పూడ్చివేతకు ‘కొత్త డాక్టర్‌’

Sep 8 2026 12:17 AM | Updated on Sep 8 2026 12:17 AM

● రూ.1.30 కోట్లతో ప్యాచ్‌హోల్‌ డాక్టర్‌ యంత్రం ● 10–15 నిమిషాల్లో గుంతలకు మరమ్మతులు

అల్లిపురం: నగర రహదారులపై గుంతలను వేగంగా పూడ్చేందుకు జీవీఎంసీ ఆధునిక ‘ప్యాచ్‌హోల్‌ డాక్టర్‌’ యంత్రాన్ని అందుబాటులోకి తెచ్చింది. రూ.1.30 కోట్లతో కొనుగోలు చేసిన ఈ యంత్రం పనితీరును కేర్‌ హాస్పిటల్‌ సమీపంలో కలెక్టర్‌ ఎం.అభిషిక్త్‌ కిశోర్‌, జీవీఎంసీ కమిషనర్‌ కేతన్‌ గార్గ్‌తో కలిసి సోమవారం పరిశీలించి, ప్రారంభించారు. రహదారి గుంతలను శుభ్రపరచడం, బిటుమెన్‌ మిశ్రమంతో పటిష్టంగా ప్యాచ్‌వర్క్‌ చేసేందుకు ఈ యంత్రం ఉపయోగపడుతుంది. జీవీఎంసీ కమిషనర్‌ కేతన్‌గార్గ్‌ మాట్లాడుతూ ఈ యంత్రం రోజుకు 10–15 ప్రాంతాల్లో, సుమారు 300 చ.మీ. విస్తీర్ణంలో ప్యాచ్‌వర్క్‌ చేపట్టే సామర్ధ్యం కలిగి ఉందన్నారు. అన్ని జోన్లలో అవసరాన్ని బట్టి యంత్రాన్ని వినియోగిస్తామని, అధిక వాహన రాకపోకలు ఉన్న ప్రాంతాలకు ప్రాధాన్యమిస్తామని చెప్పారు. యంత్రాన్ని సరఫరా చేసిన సంస్థే మూడేళ్లపాటు ఆపరేషన్‌, నిర్వహణ బాధ్యతలు చేపడుతుందని వివరించారు. కలెక్టర్‌ అభిషిక్త్‌ కిశోర్‌ మాట్లాడుతూ, రహదారి గుంతలను ఎప్పటికప్పుడు గుర్తించి, తక్షణమే మరమ్మతులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో మెకానికల్‌ విభాగం పర్యవేక్షక ఇంజినీర్‌ ఎస్‌ఈ రాయల్‌ బాబు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement