ఆర్‌ఐఎన్‌ఎల్‌ ప్లాట్లకు యూనియన్‌ బ్యాంక్‌ రుణ సదుపాయం | - | Sakshi
Sakshi News home page

ఆర్‌ఐఎన్‌ఎల్‌ ప్లాట్లకు యూనియన్‌ బ్యాంక్‌ రుణ సదుపాయం

Sep 7 2026 7:45 AM | Updated on Sep 7 2026 7:45 AM

మహారాణిపేట: విశాఖపట్నంలోని రాష్ట్రీయ ఇస్పాత్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎన్‌ఎల్‌)కు చెందిన 459 ప్లాట్లను నేషనల్‌ ల్యాండ్‌ మానిటైజేషన్‌ కార్పొరేషన్‌ (ఎన్‌ఎల్‌ఎంసీ) ఆన్‌లైన్‌ వేలం ద్వారా విక్రయిస్తున్న నేపథ్యంలో, ఈ వేలంలో ప్లాట్లను దక్కించుకునే వారికి యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా రుణ సదుపాయం కల్పిస్తోంది. ఇందుకు సంబంధించి స్టీల్‌ప్లాంట్‌ బ్రాంచ్‌లో ప్రత్యేక ప్రచార బ్యానర్‌ను బ్యాంక్‌ అధికారులు ఆవిష్కరించారు. హెచ్‌బీ కాలనీ, మద్దిలపాలెం, ఆటోనగర్‌, గాజువాక ప్రాంతాల్లోని ఈ స్థలాలకు అక్టోబర్‌ 12, 16 తేదీల్లో ‘ఈ–నివిద’ ప్లాట్‌ఫామ్‌పై వేలం జరగనుందని వారు తెలిపారు. అత్యధిక ధరకు ప్లాట్లను దక్కించుకున్న అర్హులైన వ్యక్తులు, డెవలపర్లు, సంస్థలకు తమ అర్హత మేరకు అవసరమైన రుణ సదుపాయాన్ని అందిస్తున్నట్లు వెల్లడించారు. ఈ స్థలాలు, రుణాలకు సంబంధించిన సమాచారాన్ని ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, భువనేశ్వర్‌ జోన్ల పరిధిలోని పలు శాఖల్లో అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. రుణ సదుపాయం అవసరమైన వారు బ్యాంక్‌ అధికారులు హేమంత్‌కుమార్‌ (7979848314) లేదా సురేష్‌ (9866363007)లను సంప్రదించవచ్చని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement