జీవో నం.11 వల్ల మా ఉద్యోగ భద్రత దెబ్బతింటోంది. ఒక శాఖ నుంచి మరో శాఖకు బదిలీలు చేస్తూ సర్వీసును అస్థిరంగా మార్చుతున్నారు. గ్రామాల్లో అన్ని ఆన్‌లైన్ సేవలు అందిస్తున్నా జేఏసీలో కూడా ప్రాతినిధ్యం లేదు. పెండింగ్‌లో ఉన్న రెండు నోషనల్ ఇంక్రిమెంట్లు, ప్రొబేషన్ బకాయిలు వెంటనే మంజూరు చేయాలి. సాయంత్రం 5 గంటల తర్వాత వాట్సాప్ సందేశాలతో ఒత్తిడి చేయడం ఆపాలి. మేము ఉద్యోగులం.. యంత్రాలం కాదు. ప్రభుత్వం తీరు మార్చుకోవాలి.
– సాంబమూర్తి, డిజిటల్ అసిస్టెంట్, శ్రీకాకుళం


