పీజీఆర్‌ఎస్‌లో క్యూఆర్‌ కోడ్‌ విధానం | - | Sakshi
Sakshi News home page

పీజీఆర్‌ఎస్‌లో క్యూఆర్‌ కోడ్‌ విధానం

Sep 7 2026 7:27 AM | Updated on Sep 7 2026 7:27 AM

మహారాణిపేట: ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి అమలు చేస్తున్న పీజీఆర్‌ఎస్‌ సేవల్లో క్యూఆర్‌ కోడ్‌ విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు కలెక్టర్‌ ఎం. అభిషిక్త్‌ కిశోర్‌ తెలిపారు. కలెక్టర్‌ కార్యాలయం, ఇతర ప్రభుత్వ కార్యాలయాలు, స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు కార్యాలయాల వద్ద ఏర్పాటు చేసిన క్యూఆర్‌ కోడ్‌ను మొబైల్‌ ద్వారా స్కాన్‌ చేసి అర్జీ పరిష్కారంపై ప్రజలు నేరుగా ఫీడ్‌బ్యాక్‌ నమోదు చేయవచ్చని పేర్కొన్నారు. నమోదైన అభిప్రాయాలను ఉన్నతాధికారులు పరిశీలించి, పరిష్కార నాణ్యతను సమీక్షిస్తారని తెలిపారు. ప్రజలు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని కలెక్టర్‌ కోరారు.

కొత్త పెన్షన్లకు దరఖాస్తుల స్వీకరణ

మహారాణిపేట: ఎన్‌టీఆర్‌ భరోసా పెన్షన్‌ పథకం కింద కొత్త పెన్షన్ల మంజూరుకు అర్హులైన వారి నుంచి సెప్టెంబర్‌ 7 నుంచి 16వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు కలెక్టర్‌ ఎం. అభిషిక్త్‌ కిశోర్‌ తెలిపారు.స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు కార్యాలయాల్లో దరఖాస్తుల స్వీకరణ, ఆన్‌లైన్‌ నమోదు, ఈ–కేవైసీ ప్రక్రియ నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఆధార్‌, రైస్‌కార్డు/ఆదాయ ధ్రువీకరణ పత్రం, సంబంధిత కేటగిరీ ధ్రువీకరణ పత్రాలను దరఖాస్తుతో జత చేయాలని సూచించారు.అర్హత పరిశీలన, క్షేత్రస్థాయి తనిఖీ అనంతరం ప్రభుత్వ అనుమతి, బడ్జెట్‌ లభ్యత మేరకు పెన్షన్లు మంజూరు చేస్తామని తెలిపారు. అర్హులైన వారు నిర్ణీత గడువులోగా దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్‌ కోరారు.

ఐటీఐల్లో మిగులు సీట్లకు దరఖాస్తుల ఆహ్వానం

కంచరపాలెం: నరవ, గడుగుపల్లి ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ కేంద్రాల్లో (ఐటీఐ) 2026–27 విద్యా సంవత్సరానికి మిగులు సీట్ల భర్తీ కోసం ఐదో విడతలో దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు నరవ ఐటీఐ ప్రిన్సిపాల్‌ బి. విజయలక్ష్మి తెలిపారు. అర్హులైన అభ్యర్థులు సోమవారం సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ చేయించుకుని కౌన్సెలింగ్‌కు హాజరు కావాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement